ఈవీఎంలపై ఇక అభ్యర్థుల ఫొటోలు

v5r955x7ఇక ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు పెట్టనున్నారు. త్వరలో జరుగనున్న ఆరు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానానికి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టబోతున్నది. ఎన్నికల కమిషన్ ఈ నెల 16న ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు ఏర్పాటుచేసేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు అన్ని రాష్ర్టాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఆదేశాలు పంపింది. బీహార్ లో నవంబర్ 29, పుదుచ్చేరిలో 6 ఫిబ్రవరి 2016న, అసోం, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో మే 29న, కేరళలో మే 31న ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు పాటించాల్సిన నిబంధనలను ఆదేశాల్లో పేర్కొన్నది. ఈవీఎంకి కుడివైపున అభ్యర్థి పేరు, గుర్తు మధ్య ఫొటోను ప్రదర్శించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా తాజా ఫొటోను మాత్రమే ఇవ్వాలి (ఆ ఫొటో మూడు నెలలలోపే తీసినదై ఉండాలి). ఫొటో 2సెంటిమీటర్ల వెడల్పు, 2.5సెంటిమీటర్ల పొడవు ఉండాలి. ఫొటోలో అభ్యర్థి బ్యాక్ గ్రౌండ్ తెలుపు రంగులో ఉండాలి.. అభ్యర్థి నేరుగా కెమెరానే చూస్తూ ఉండాలి (కళ్లు మూసుకుని, పక్కకు తిరిగిఉన్న ఫొటోలను అనుమతించరాదు). అభ్యర్థి ఫొటో సాధారణ దుస్తులు మాత్రమే ధరించాలి (యూనిఫాం, టోపీ, కళ్లద్దాలు ధరించిన ఫొటోలు అనుమతించరాదు). ఈ నిబంధనలు మే 1, 2015నుంచి అమల్లోకి వస్తాయని ఈసీ స్పష్టం చేసింది.