ఈశాన్య రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిస్తాం-రాజ్‌నాథ్‌

4

న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జనంసాక్షి):  ఈశాన్య రాష్టాల్ర ప్రజలకు భద్రత కల్పించే విషయంలో రాజీపడేది లేదని కేంద్ర¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రధానంగా దేశరాజధాని ఢిల్లీలో భద్రత చాలా ముఖ్యమని అన్నారు. ఈశాన్య రాష్టాల్ర నుంచి వచ్చే ప్రజల భద్రతపై పోలీసులు దృష్టి సారించాలని కేంద్ర ¬ంమంత్రి రాజనాథ్‌ సింగ్‌ అన్నారు. సోమవారం ఆయన దిల్లీ పోలీస్‌ 68వ రైజింగ్‌డే ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య రాష్టాల్ర నుంచి దేశరాజధానికి వచ్చే ప్రజలు అభద్రత భావానికి లోనుకాకుండా చూసే భాద్యత పోలీసులపై ఉందన్నారు. దిల్లీలో మహిళల భద్రత మరో ప్రధాన అంశమన్నారు. మహిళలపై నేరాల దర్యాప్తునకు అన్నిరాషాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసే విధంగా కృషిచేస్తానన్నారు. మహిళల భద్రత కోసం దిల్లీ పోలీసులు ప్రవేశపెట్టిన ‘హిమ్మత్‌’ అనే యాప్‌ను రాజ్‌నాథ్‌ ప్రశంసించారు.