ఈశ్వరీబాయి వర్థంతి అధికారికంగా..
69 ఉద్యమంలో ఆమె పాత్ర అమోఘం
సీఎం కేసీఆర్
హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి, ఈశ్వరీభాయి కుమార్తె గీతారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రధాతల్లో ఒకరైన ఈశ్వరీభాయి వర్ధంతిని ఫిబ్రవరి 24న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం ప్రకటించారు. ఈశ్వరీభాయి జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో పొందుపరుస్తామని తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరీభాయి ప్రసంగాలు ఎంతో స్పూర్తినిచ్చాయని పేర్కొన్నారు. ఈశ్వరీభాయి తెలంగాణ కోసం ఎంతో పరితపించారని గుర్తు చేశారు.