ఈ ఎస్ డి మీసేవ కమిషనర్ ను కలిసిన వనపర్తి జిల్లా మీసేవ ఆపరేటర్లు

పాన్ గల్ జులై  ( జనం సాక్షి )
వనపర్తి జిల్లాలో ఇటీవల కొత్తగా 11 మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించిన ప్రక్రియలో ఏలాంటి అవినీతి జరగలేదని , ఎంపికైన మీసేవ ఆపరేటర్ల ఈ ఎస్ డి కమిషనర్ మరియు టి ఎస్ టి ఎస్ జి టి వెంకటేశ్వర్లు ఐ ఆర్ ఎస్ గారిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మీసేవ ప్రొసీడింగ్స్ తీసుకొని రెండు నెలలు కావస్తున్నా మాకు ఇంతవరకు టి ఎస్ టి ఎస్ నుండి మీసేవ కేంద్రాలకు ఐడి, పాస్వర్డ్ మంజూరు చేయలేదని, అలాగే వనపర్తి ఈ డి యం వినోద్ కుమార్ పై కొందరు మీ సేవ మరియు ఆధార్ సెంటర్ నిర్వాహకులు కావాలని ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేశారని, ఈ ఎస్ డి కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు..పాత మీసేవ సెంటర్ లు వారి అడ్రస్ లు, డిస్టెన్స్, గైడ్లైన్స్ ప్రకారమే మీసేవ సెంటర్లను కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ప్రకారమే మీ సేవలు ఉన్నాయని, కానీ కొందరు మీసేవ మరియు ఆధార్ సెంటర్ వారు గైడ్లైన్స్ పాటించకుండా ఆధార్ సెంటర్లో మీ సేవలు నడుపుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని మరియు ఆధార్ సెంటర్లోని మీ సేవలను వారికి కేటాయించిన అడ్రస్ లో కాకుండా మార్చుకున్నారని తెలిపారు. అది మనసులో పెట్టుకొని కొందరు ఆధార్ మరియు మీ సేవలకు సంబంధించిన ఆపరేటర్లు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈడీఎం గారిపై పలు విధాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. నూతన మీసేవ కేంద్రాల నిర్వాహకులు అయిన మేము ఈ డి యం గారికి గాని, మాపై అధికారులకు గాని ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని కమిషనర్ గారికి, డిప్యూటీ పైనాస్ వరలక్ష్మి గారి కి డిప్యూటీ అడ్మిన్ విజయ భాస్కర్ గారికి వివరించారు..ఈ డి యం గారిపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, మళ్లీ ఈడీఎం గారిని విధుల్లోకి తీసుకోవాలని కమిషనర్ గారిని కోరారు..ఈ కార్యక్రమంలో మీ సేవ నిర్వాహకులు లక్ష్మణ్ కుమార్ , మన్నెం , సుమంత్ ,పి విజయ్ కుమార్ వి స్వామి విజయ్ కుమార్ డాకేశ్వర్ గౌడ్, భాస్కర్ లక్ష్మి రాఘవేందర్ భాస్కర్,రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు