సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గాయని సీపీ సీవీ ఆనందర్ తెలిపారు.ఈ ఏడాదిలో జరిగిన నేరాలను ఆయన మీడియాకు వివరించారు. గతేడాదిలో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గాయన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక రికవరీలు సైబరాబాద్ పరిధిలోనే జరిగినట్లు తెలిపారు. అతి తక్కువ మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నా.. అన్ని రకాల సమస్యలు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. చోరీ కేసుల్లో 79 శాతం రికవరీ చేసిట్లు వెల్లడించారు. ఎల్బీనగర్ పరిధిలో ఈ ఏడాది 8,600కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయినట్లు చెప్పారు. కందుకూరు పరిధిలో తక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. షీటీమ్స్ తో ఈవ్‌టీజింగ్ భారీగా తగ్గిందన్నారు. ఈ ఏడాది 3896 రోడ్డు ప్రమాదాలు జరినట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 420 చైన్‌స్నాచింగ్ కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ పోలీసుల పని తీరు అద్భుతం అంటూ ప్రశంసించారు. అందరి సమన్వయంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆనంద్ వెల్లడించారు.