ఈ కేవైసీ ఈనెల 31లోగా చేయించుకోవాలి

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్
మల్దకల్ ఆగస్టు26 (జనంసాక్షి) మండల పరిధిలోని చర్ల గార్లపాడు  గ్రామంలోని పంటలు నమోదు కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద నాయక్ ఆకస్మికంగా పరిశీలించారు.శుక్రవారం గ్రామంలో పంటల నమోదును పరిశీలించడం జరిగింది.ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు.వ్యవసాయ విస్తిర్ణ అధికారులు ప్రతి పంటను నమోదు చేయాలని సూచనలు, ప్రధానమంత్రి కిసాన్ పొందిన రైతులు అందరూ 12 విడత పొందాలంటేఈ కేవైసీ చేయించుకొని రైతులందరూ, మీకు దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రంలో ఈ కేవైసీ ఈ నెల31 వ తేదీలోగా చేయించుకోవాలని తెలిపారు.ఈ కేవైసీ సమాచారం కొరకు వ్యవసాయ శాఖను సంప్రదించగలరు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాజశేఖర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి సుజాత రైతులు పాల్గొన్నారు