ఈ చిన్నారులకు తల్లి లేని లోటు తీర్చేదెవరు?

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడంతో మాడుగుల మండలం కొలుకుల పల్లి గ్రామానికి చెందిన మేరావత్ మౌనిక, ఇబ్రహీంపట్నం మండలం సీతారాం పేటకు చెందిన లావణ్య, మంగళవారం నాడు  నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలలో చికిత్స పొందుతు మృతి చెందారు. అవుతాపురం లావణ్య మృతిని తట్టుకోలేక మృతురాలి కుటుంబ సభ్యులు సీతారాంపేట రహదారుపై రాస్తారోకో నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 25వ తేదీన 34 మంది పేషంట్లకు అనుభవం లేని డాక్టర్ల చేత ఆపరేషన్ చేయించడంతో ప్రమాదం సంభవించిందని ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని తక్షణమే 50 లక్షలు నష్టపరిహారం అందించాలని ఐదు లక్షల నష్టపరిహారం ఎవరికి సరిపోతాయని నలుగురు మహిళల మృతికి కారణమైన వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.? లావణ్య కు ఒక బాబు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మృతురాలి భర్త మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తన భార్య చనిపోయిందని తన పిల్లలకు తల్లి లేని లోటు ఎలా తీర్చగలరని భావోద్వేగానికి గురయ్యారు ప్రభుత్వం  తమకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు జయమ్మ నాయకులు టేకుల కమలాకర్ రెడ్డి  పరామర్శించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ  ప్రభుత్వ దావఖానాలో అనుభవం లేని డాక్టర్ల చేత కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్సలు చేయించడం వల్లనే నలుగురు మహిళలను మృతి చెందారని ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్ర వాతావరణంలో ఆపరేషన్లు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో పలుమార్లు వైద్యులను సిబ్బందిని ప్రశ్నించినప్పుడు ఆపరేషన్లకు వచ్చిన పేషంట్లనే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారని మండిపడ్డారు. నలుగురి మహిళల మృతికి కారణమైన చర్యలు తీసుకోవాలని మహిళల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.