ఈ నెల 9న రాష్ట్రబంద్‌కు భాజపా పిలుపు
హైదరాబాద్, జనంసాక్షి: విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9న భారతీయ జనతా పార్టీ రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీల ఉద్యమాలు, ప్రజల నిరసనలను తలొగ్గిన ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్లు నటిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. విద్యుత్ చార్జీలు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం బాధ్యతారాహిత్యమన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలన్నారు.