ఈ నెల25న సంజయ్‌దత్ విడుదల
పుణె,ఫిబ్రవరి 22(జనంసాక్షి): జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ నెల 25న విడుదల కాబోతున్నాడు. ఎరవాడ జైలు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. 1993 ముంబై బాంబు పేలుళ్లు, అక్రమాయుధాల కేసులో సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని ఎరవాడ జైలులో ఆయన శిక్ష
అనుభవిస్తున్నాడు. సత్ప్రవర్తన కింద ప్రభుత్వం కొంత శిక్షాకాలాన్ని తగ్గించడం, మిగిలిన శిక్షాకాలాన్ని పూర్తి చేయడంతో సంజయ్ విడుదలకు లైన్ క్లియరైంది. గురువారం ఉదయం 9 గంటలకు జైలు నుంచి బయటకురానున్నాడు. జైలు వద్ద సంజయ్ భార్య మాన్యత, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలకనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జైలు వద్దకు రావచ్చని భావిస్తున్నారు.