ఈ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష

*ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్
* టేకులపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో హరిప్రియ

టేకులపల్లి, అక్టోబర్ 28 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర సంక్షేమాభివృద్ధికి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష, ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడని ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ అన్నారు. శనివారం టేకులపల్లి మండలంలో సంపత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.గంగారం, చింతోని చిలుక, మేళ్ల మడుగు, కొప్పురాయి, బర్లగూడెం గ్రామపంచాయతీలలో విస్తృతంగా పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా హరిప్రియ మాట్లాడుతూ హామీలను అమలు చేయలేని మాటలు చెబుతూ మరొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని చీకటిమయం చేయడానికి అధికారాన్ని దక్కించుకోవడం కోసం మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే ఇక్కడ ప్రజలు కొంతైనా నమ్మేవారన్నారు. ఎన్నికలు రాగానే కొత్తబిచ్చగాళ్ల మాదిరిగా కాంగ్రెస్‌,బీజేపీ నాయకులు గ్రామాలలో ఓట్లకు గాలం వేయడం కోసం నోరు తెరిస్తే చాలు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని అన్నారు. మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నరని,నమ్మితే మోసపోవడం ఖాయమని ప్రజలు గమనించాలన్నారు.ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్, ఇప్పుడు డబ్బులకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు.గత సంక్షేమ పథకాలకు తోడు కొత్త పథకాలను, మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రైతు బీమా తరహాలోనే పేదల కోసం “కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి దీమా” ను అమలు చేస్తారన్నారు.దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.�