ఈ రోడ్డు బాగుపడదా..! మా కష్టాలు తొలగిపోవా..!!

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల డిమాండ్

, జూలై    (జనంసాక్షి): మునగాల నుండి కీతవారిగూడెం ఆర్ అండ్ బి రోడ్డు మీద నడుద్దామన్నా.., వాహనాల మీద ప్రయాణం చేద్దామన్నా.., ప్రజలు తమ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్ అండ్ బి రోడ్డు అంటేనే ప్రజలు వామ్మో అని భయపడుతున్నారని అన్నారు. ఈ రోడ్డుమీద దాదాపు 40 గ్రామాల ప్రజలు మునగాల నుండి కోదాడ్, సూర్యాపేట జిల్లా కేంద్రానికి, హుజూర్నగర్ నియోజకవర్గ నుండి ప్రజలు ఈ రోడ్డు మీద సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసినారు. ఈ రోడ్డుకు 20 కోట్లు మంజూరైనాయని చెప్పుకుంటున్న ఆర్ అండ్ బి అధికారులు కాగితాలకే పరిమితమైనారు తప్ప ఆచరణలను అమలు చేయడంలో అధికారులు విఫలమైనారని వారన్నారు. గణపవరం గ్రామం వద్ద అకాల వర్షం వచ్చిందంటే వాగు దాటాలన్నా ప్రజలు తమ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించినారు. గత సంవత్సరంలో అకాల వర్షాలకు వాగు తెగి పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పినా అధికారులు ఇప్పటికీ ఒక్క పైసా కూడా వెచ్చించి ఒక్క రోజు కూడా పని ప్రారంభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేసినారు. అకాల వర్షాలతో మునగాల నుండి కీతవారిగూడెం ఇరుకు రోడ్డులో వాహనాలు ఎదురైతే యాక్సిడెంట్లు కావడం, అనేకమంది మరణించడం జరిగిందని గుర్తు చేశారు. తిమ్మారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ సైదిరెడ్డి వాహనం ఢీకొని కాలు విరిగినా గాని అయ్యో పాపం అనే నాధుడే కరువైనారని వారన్నారు. రోడ్డుమీద తట్టెడు మట్టి పోసిన దాఖలాలే లేవని ఆయన అన్నారు. సిపిఎం పార్టీ అనేక పోరాటాల ఫలితంగా నిధులు మంజూరైన చెప్పిన అధికారులు ఆచరణలను అమలు చేయడంలో వైపల్యం చెందినారని అన్నారు. ఇప్పటికైనా మునగాల నుండి కీతవారిగూడెం వరకు ఆర్ అండ్ బి రోడ్డును వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టకపోతే ప్రజలను సమీకరించి సిపిఎం ఆధ్వర్యన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వారు అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి చందా చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు రేఖ లింగయ్య, శాఖ కార్యదర్శి నందిగామ సైదులు, వైస్ సర్పంచ్ రావులపెంట బ్రహ్మం, సొసైటీ డైరెక్టర్ శంబయ్య, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు వటైపు సైదులు, ములకలపల్లి సైదులు,  ములకలపల్లి నాగరాజు, గురుమూర్తి, శీను తదితరులు పాల్గొన్నారు.