ఉక్కు కర్మాగారంపై చిత్తశుద్ది లేని బాబు
ఆనాడు వైఎస్ మాత్రమే పరిశ్రమ కోసం కృషి చేశారు: వైకాపా
కడప,జూలై6(జనం సాక్షి): కడప ఉక్కు పరిశ్రమను సాధించాలన్న పట్టుదల చంద్రబాబుకు ఉండివుంటే నాలుగేళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉక్కు పరిశ్రమ స్థాపించి జిల్లాలో నిరుద్యోగు లకు ఉద్యోగాలు కల్పించాలని చూస్తే అప్పట్లో చంద్రబాబు ఆటంకాలు కల్పించారన్నారు. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో 11 రోజుల పాటు ఉక్కు దీక్ష పేరుతో దొంగదీక్ష.. వంచన దీక్ష చేయించారని ధ్వజమెత్తారు. జిల్లాలో అనేక ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే చేపట్టారని, అయితే నేడు అధికార పార్టీ ఆ పనులు ఏమాత్రం చేపట్టకుండా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. నాలుగేళ్లపాటు బిజెపితో అంటకాగిన బాబు ఇప్పుడు వైకాపా పోరాటాలను పక్కన పెట్టేలా వ్యవహరిస్తూ లబ్దిపొందే ప్రయత్నాల్లో ఉన్నారని శుక్రవారం నాడిక్కడ అన్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకయీ కుట్రలకు తెరలేపారని అన్నారు. నాలుగేళ్ల తరవాత మరోమారు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజలు బాబు మోసాలను గుర్తించి ఇచ్చిన హావిూలపై ఎక్కడిక్కడ నిలదీయాలన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రజలను ఎలా మోసం చేయాలి.. వారి ఓట్లు ఎలా సంపాదించాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతారన్నారు. అయితే ప్రజలు వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. అమరావతి పేరుతో వేలకోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారన్నారు. విదేశీ ప్రయాణాలు తప్ప బాబు సాధి/-ంచిన ప్రగతి ఏవిూ లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలనను చూస్తున్నారని పేర్కొన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ ప్రభుత్వం అన్నారు.