ఉచితంగా గణపతి మట్టి విగ్రహాల పంపిణీ
అశ్వరావుపేట, ఆగస్టు 30( జనంసాక్షి )
గణపతి నవరాత్రుల పురస్కరించుకొని వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతులను అశ్వరావుపేట సీఐ బాలకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండలంలోని తిరుమలకుంట వినాయకపురం గ్రామాల్లో ఆంధ్రజ్యోతి , ఏబీఎన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ బాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సిఐ మాట్లాడుతూ ప్రస్తుతం కాలాన్ని బట్టి భూమిపై కాలుష్యం పెరిగిపోతుందని కాలుష్య నివారణే మార్గంగా రంగులు, కెమికల్స్ తో తయారు చేసే విగ్రహాలను నివారించి మట్టితో తయారుచేసిన గణపతి విగ్రహాలను పూజించినట్లయితే కాలుష్యాన్ని నివారించడం వల్ల మానవాళికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామ లక్ష్మయ్య, వైస్ సర్పంచ్ రాంబాబు, తెరాస పార్టీ మండల కార్యదర్శి జుజ్జూరు వెంకన్న బాబు,బొల్లు కొండ చెన్నారావు, ఎంపీటీసీ నాగలక్ష్మి, తోకల పెద్ద సత్యనారాయణ, శ్రీను, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.