ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ కవిత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తుందని కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి అన్నారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ప్రైవేటుకు వెళ్లే అవసరం లేకుండా  ప్రభుత్వ ఆసుపత్రుల్లో  ప్రసవాలు అధిక సంఖ్యలో అవుతుండడం శుభపరిణామం అన్నారు. గ్రామ ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆరోగ్యాన్ని శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు .నలుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం గ్రామంలో చికిత్స అందించారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్తవరపు ఆంధ్రజ్యోతి రవి, పిఎసిఎస్ చైర్మన్ ముత్తవరపు రమేష్ ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాసాని శ్రీనివాస్, వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ,కళ్యాణ్,  లక్ష్మీప్రసన్న, కృష్ణవేణి, ఏఎన్ఎం మీనా కుమారి, దాసరి వీరబాబు, వనపర్తి ఉపేందర్, బూరెల కరుణాకర్ ,గద్దల వెంకటేశ్వర్లు, పాలకి సురేష్ ,సొందు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.