ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 21 : నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ పేర్కొన్నారు తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో:పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా తూప్రాన్ పోలీస్ స్టేషన్ మరియు జి.యం.అర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూప్రాన్ మండల పరిధిలో గల మేజర్ గ్రామపంచాయతీ ఘనపూర్ గ్రామంలో  సీ.యం.అర్ హాస్పిటల్ కండ్లకోయ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తూప్రాన్ ఎంపీపీ, మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరమ్ ఉపాధ్యక్షురాలు గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్  మరియు తూప్రాన్ ఎస్.ఐ. లు సురేష్ కుమార్ ప్రారంబించరు. ఈ సంధర్బంగా తూప్రాన్ ఎంపీపీ, మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరమ్ ఉపాధ్యక్షురాలు గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా ఉచిత వైద్య శిబిరాలు దోహదపడతాయని, సి.యం.అర్ హాస్పిటల్ వారు నిపుణులైన వైద్య బృందంచే పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందించడం అభినందనీయమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తూప్రాన్ పోలీస్ స్టేషన్ మరియు జి.యం.అర్ వరలక్ష్మి ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేశారు. తూప్రాన్ ఎస్. ఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ అమరులైన పోలీసుల జీవితాలను ఆదర్శంగా మలుచుకుంటు ప్రజాసేవకు సిద్దం కావాలన్నారు.  నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతూ, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పోలీసులు పని చేస్తున్నారన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్‌ శాఖ అత్యుత్తమంగా పనిచేస్తూ ప్రజాసేవలో ముందంజలో ఉందని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా నుండి ప్రజలను కాపాడే క్రమంలో ఎంతో మంది పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయారన్నారు. పోలీసుల త్యాగాలను స్మరించుకుంటు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఘనపూర్ గ్రామంలో జి.యం.అర్ వరలక్ష్మి ఫౌండేషన్ మరియు సీ.యం.అర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ వేణు, డాక్టర్ నీహారిక  మరియు సిబ్బంది ఆద్వర్యంలో రోగులకు  బి. పి., షుగర్ మరియు సాధారణ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెరాస  అధ్యక్షులు వినోద్ కుమార్ మరియు అశోక్, కే. వెంకటేష్, జి. మల్లేష్, రవి, డాక్టర్ వేణు, నిహారికా, ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్, సి.యం.అర్ హాస్పిటల్ దుర్గాప్రసాద్ రెడ్డి, మధు హాస్పిటల్ సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.