ఉత్తమ్‌ కుమార్‌ వల్లే ఓడిపోయాం

2

– పొన్నాల కన్నా అధ్వాన్నం

– హరీశ్‌ను కలిసిన కొమటిరెడ్డి

హైదరాబాద్‌,జూన్‌ 4(జనంసాక్షి):  తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీపై ఆ పార్టీ నాయకుడు, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన  సంచలన వ్యాఖ్యలు చేశారు.  పొన్నాలను మించిన అసమర్థుడు ఉత్తమ్‌ అంటూ కామెంట్‌ చేశారు. తక్షణం కాంగ్రెస్‌కు కాకల్ప చికిత్స చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీని బాగు చేయాలంటే తక్షణమే సర్జరీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. టి. కాంగ్రెస్ను ప్రక్షాళన చేయకపోతే పార్టీని పోస్ట్మార్టం చేసే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను మించిన అసమర్థుడు ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రె అని ఆయన ఆరోపించారు. పార్టీ వరుస ఓటములకు బాధ్యత వహించి… పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందని ఉత్తమ్‌కు  కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. పార్టీ నాయకులు సీరియస్‌గా  తీసుకోకపోవడం వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపాలైందన్నారు. నేనే పీసీసీ చీఫ్‌ అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేవాణ్ణి… లేదంటే రాజీనామా చేసేవాణ్ణి అని చెప్పారు. పొన్నాల, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నాయకత్వంలోనే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత పార్టీ పరిస్థితిపై తక్షణమే పార్టీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలోని 15, 20 మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తామే సీఎం అభ్యర్థి అని అనుకుంటున్నారని వెల్లడించారు. గాంధీభవన్‌లో  ప్రెస్మీట్లతో కాంగ్రెస్‌ పార్టీ ఒలపడదని… ఓట్లు కూడా రావని ఆయన పేర్కొన్నారు. భువనగిరి లోక్సభ ఎన్నికల్లో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గ్రూప్‌ రాజకీయాలే కారణమని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ సందర్భంగా అధిష్టానానికి సూచించారు. కాగా నల్లగొండ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగుతుందన్న దానికి నిదర్శనంగా నల్లగొండ రాజకీయాలు నిలుస్తున్నాయి. ఓ వైపు కోమటి రెడ్డి బ్రదర్స్‌ టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచారం జరగుతుండగా నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపి గుత్తా సుఖేందర్‌ రెడ్డి కూడా పార్టీలో చేరుతారన్నప్రచారం సాగుతోంది. ఈ దశలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. వీరు ఏ అంశాలపై చర్చించారకన్నది ఎలా ఉన్నా వీరి భేటీ ఊహాగానాలకు తెరతీసింది. ఈ భేటీలో ఎలాంటి ప్రత్యేకత లేదని  కోమటిరెడ్డి అన్నారు.  హరీష్‌ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకే ఆయనను కలసినట్లు ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్లో కోమటిరెడ్డి  విలేకర్లతో మాట్లాడుతూ… నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను హరీష్‌ రావు సందర్శించారని చెప్పారు.ఈ  నేపథ్యంలో ఆయనను కలసి కృతజ్ఞతలు చెప్పినట్లు చెప్పారు. టీఆర్‌ఎస్లో చేరతారా ? అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు… టీఆర్‌ఎస్‌లో చేరతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. అలాగే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అని విలేకర్లు ప్రశ్నించగా… ఈ అంశంపై నో కామెంట్‌ అంటూ కోమటిరెడ్డి జవాబు దాటి వేశారు. టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి హరీష్‌రావుతో టీ.కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఒక్కరే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారా లేక సోదరుడు రాజగోపాల్‌రెడ్డితో కలిసి చేరతారా అనే దానిపై స్పష్టత లేదు. కాగా కాంగ్రెస్‌లోనే ఉండాలని రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి నిన్న హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఆ వెంటనే మంత్రి హరీష్‌రావుతో సమావేశమయ్యారు. దాదాపు అరంగటపాటుగా భేటీ కొనసాగుతోంది. ఈ భేటీతో కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరికపై దాదాపు రంగం సిద్దమైంది. ఆయనతో పాటు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. హరీష్‌తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కోమటిరెడ్డి సమావేశం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కాంగ్రెస్‌ రాజకీయీలపై కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో సరిగా పనిచేకపోవడం వల్లనేకాంగ్రెస్‌ గెలవలేక పోయిందన్నారు. తెలంగాణ పోరాటం చేసిన వారినే పిసిసి చీఫ్‌ చేయాలన్నారు. తాను పిసిసి చీఫ్‌గా ఉండవుంటే, తనహయాంలో ఓటమి జరిగితే వెంటనే రాజీనామా చేస్తానని అన్నారు. ఇదిలావుంటే  ప్రస్తుతానికి టీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచన లేదని, భవిష్యత్‌లో ఏదైనా జరుగొచ్చని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూనే…ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. భవిష్యత్‌లో ఏదైనా జరుగొచ్చంటూ మనసులోమాట వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నిందించడం సబబుకాదన్నారు. కాంగ్రెస్‌ శ్రీకృష్ణ కమిటీ వేసి అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్టాన్న్రి ప్రకటించిందని తెలిపారు. తాజా వ్యవహారాలతో  నల్లగొండ కాంగ్రెస్‌ కోటకు బీటలు పడనున్నాయన్న  సమాధానం వస్తోంది ఈ జిల్లా కాంగ్రెస్‌  నేతల నుంచి. ఇంత కాలం టీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడిన ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి టోన్‌ మార్చారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ సక్రమమే అని సర్టిఫై చేసేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు వ్యాఖ్యలను గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పూర్తి మద్దతిస్తున్నానని, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ను స్వాగతిస్తున్నానని అన్నారు. గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాటలను బట్టి చూస్తే త్వరలోనే ఆయన కూడా కారెక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డితో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా టీఆర్‌ఎస్‌ లో చేరవచ్చని చెబుతున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి నల్లగొండ జిల్లాలో కోలుకోలేని దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది. మరో వైపు కోమటిరెడ్డి బ్రదర్స్‌ కూడా పార్టీ మారొచ్చని ప్రచారం సాగుతోంది.