ఉత్తరాఖండ్‌పై మోదీ క్షమాపణ చెప్పు
– కేజ్రీవాల్
న్యూఢిల్లీ,మే11(జనంసాక్షి): ఉత్తరాఖండ్ లో అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి నందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతికి క్షమాపణ చెప్పాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ వ్యవహారం నుంచి మోదీ సర్కారు పాఠాలు నేర్చుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసాలకు మళ్లీ పాల్పడరని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేసేందుకు ప్రయత్నించబోరన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడంతో మోదీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.