ఉదయమే గ్రామాల బాటపడుతున్న నేతలు

అభివృద్దిని ఆశీర్వదించాలని నేతల పిలుపు

ఊరూరా ప్రచారంలో అభివృద్ది కార్యక్రమాల ఏకరువు

జనగామ,నవంబర్‌3(జ‌నంసాక్షి): గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. మూడు నియోజకవర్గాల అబ్యర్థులు ఉదయమే గ్రామాల బాటపడుతున్నారు. నేరుగా ప్రజలను కలుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గం సస్యశ్యామలం కావడం ఖాయమని టిఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. దీనిని అడ్డుకున్న కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులకు ప్రజలు ఓటుతో బుద్ది చెప్‌ఆపలన్నారు. పాలకుర్తిలో గతంలో ఎప్పుడూ లేనంతగా అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు. వివిధ ప్‌ఆరంతాల్లో పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలో పలువురు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎర్రబల్లి మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు గోస పడ్డారన్నారు. అభివృద్దిని అడ్డుకున్న వారికి పాలకుర్తి ప్రజలు వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే కన్నీరే మిగులుతుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. దళితుల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనే క సంక్షేమ పథకాలను రూపొందించిందన్నారు. నిరుపేదలైన దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దశల వారీగా అర్హులకు భూ పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామాల్లో రైతులతో సమన్వయ సమితిని ఏర్పాటు చేసి, రైతుల పాలిట కేసీఆర్‌ దేవుడై నిలిచారన్నారు. రాష్ట్రంలోని రైతన్నల మోముల్లో చిరునవ్వులు చిందేలా పరిపాలన అందించాలన్నదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రధాన లక్ష్యమని దయాకర్‌రావు అన్నారు. నియోజకవర్గంలోని రైతులకు ఆశించిన స్థాయిలో సాగు జలాలు లేక ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడ్డారని జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి అన్నారు. పట్టణాలకు వలసలు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక రైతాంగాన్ని ఏనాడు పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు చెబుతున్నారని మండలాలకు ఎస్సారెస్పీ, దేవాదుల జలాలను తీసుకొచ్చినట్లు వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వచ్చే ప్రతిపక్ష పార్టీలను గతంలో ఏం చేశారని నిలదీయాలన్నారు. తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అండగా నిలుస్తానని ఓటర్లను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తామని, ఆయా పథకాలను దేశంతోపాటు ప్రపంచదేశాలు మెచ్చుకున్నాయన్నారు. ఇదిలావుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందని స్కటేషన్‌ ఘనాపూర్‌ అభ్యర్తి డాక్టర్‌ రాజయ్య అన్నారు. గ్రామంలోని ప్రతి ఎకరాకు రెండో పంటకు నీరందిచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటికి పెద్దన్నలా కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంతబం లబ్దిపొందేలా పథకాలను రూపొందించి అమలు చేసినట్లు తెలిపారు. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే సామర్థ్యం ఒక్క కేసీఆర్‌కు ఎందన్నారు. ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.