ఉద్యమకారులైతే వేల కోట్ల ఆస్తులు ఎలావచ్చాయి?
` అసలైన ఉద్యమకారులు తాము ఉద్యమకారులమని చెప్పుకోలే
` కొందరు గాలి ప్రణాళికలతో దేశాన్ని ఏలాలని చూశారు
` వ్యక్తిగత కక్షలకోసం రాజకీయాలు వాడుకునే స్థాయిలో లేను
` అందెశ్రీ హసిత భాష్పాలు పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో ఆనాటి నుంచినేటి వరకు …అసలైన ఉద్యమకారులు ఎవరు కూడా తాము ఉద్యమకారుణ్ణి అని చెప్పుకోలేదని, కొద్ది మంది ఉద్యమకారులని చెప్పుకునే వాళ్లకి టీవీలు, పేపర్లు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు అర్థం కావడం లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు గాలికి అనుకూలంగా ప్రణాళికలు వేసుకుని, దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో తెలంగాణ పేరు, పేగు బంధాన్ని తెంచుకున్నారని పరోక్షంగా కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. తాను ఎవరిని కూడా శత్రువుగా చూడనని, తాను శత్రువుగా చూడాలంటే వాళ్లకు స్థాయి ఉండాలని అన్నారు. 2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రముఖ కవి అందేశ్రీ రచించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కవులకు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ అని అన్నారు. ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తిగా గూడ అంజన్న, దాశరథి, కాళోజీ, అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న లాంటి కవులు నిలిచారని గుర్తు చేశారు. తనపై తనకు సంపూర్ణ నమ్మకం కలిగించి, కార్యోన్ముకిన్ని చేసి యుద్ధ రంగానికి సిద్ధం చేసిన వ్యక్తి శ్రీకృష్ణుడు అని అన్నారు. తాను కొంచెం ఓపెన్‌గా మాట్లాడు తానని, ఎక్కువ టైమ్ రాజకీయ కార్యక్రమాలకు ఇస్తానని, ఎందుకుంటే అక్కడ తాము మాట్లాడేదే ఫైనల్ ఉంటుందని అన్నారు. కానీ ఈ పుస్తకావిష్కరణలకు రావాలంటే పదంపదం ప్రిపేర్ అయ్యి రావాలని అన్నారు. కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానని, ఇంత గొప్ప అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చారని అన్నారు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని, తనకు వాళ్ల విూద ప్రయోగిస్తే తనకంటే మూర్ఖుడు మరోకరు ఉండరని అన్నారు. తాను కర్మసిద్ధాంతాన్ని నమ్ముతానని, వాళ్ల పాపాన వాళ్లేపోతారని భావిస్తానన్నారు. తన గెలుపుతో గిట్టని వాళ్లకు దుఃఖం వచ్చిందని, తాను సంతకం పెడుతుంటే వాళ్లకు గుండెల్లో రాసినట్టు అయ్యిందని అన్నారు. అందాల పోటీల్లప్పుడు 109 దేశాల సుందరీమణులతో జయ జయహే తెలంగాణ పాటను పాడిరచామని, వాళ్లను తెలంగాణ తల్లి ముందు మొకరించామని అన్నారు. కట్టడాలు ఎవరైనా కట్టొచ్చని, అందమైన భవనాలు అభివృద్ధి కాదని, పేదలకు సొంత ఇళ్లు ఇచ్చి ఆత్మగౌరవం నిలబెడుతున్నామని అన్నారు. ఒకనాడు సీఎంను చూడాలంటే గొప్ప సన్నివేశం. కానీ ఇప్పుడు ఎప్పుడైనా, ఎవరైనా కలవచ్చని అన్నారు. తాను జడ్పీటీసీ కాగానే కౌన్సిల్ వచ్చిందని, తర్వాత ఎమ్మెల్సీ అయ్యానని, తెలంగాణకి రెండో సీఎం అయ్యానని అన్నారు. 2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని సీఎం అన్నారు. తనకు రాజకీయాల్లో శత్రువులెవరూ లేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను శత్రువుగా చూడాలన్నా ఆ వ్యక్తికి అంతటి స్థాయి ఉండాలని చెప్పారు. వ్యక్తిగత పగకోసం తన పదవిని అడ్డం పెట్టుకుంటే తనకన్నా మూర్ఖుడు ఇంకొకరు ఉండరని చెప్పారు. శత్రువులకు తన గెలుపే అసలైన శిక్ష అని అన్నారు. తాను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతానన్న సీఎం రేవంత్.. ఎవడి పాపాలకు వాడే బలైపోతారని చెప్పారు. .తనకు అన్ని చట్ట సభల్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. అద్దాల మేడలు అభివృద్ధి కాదని.. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరినప్పుడే అసలైన విజయం అని అన్నారు. నిజమైన ఉద్యమకారులెవరూ ఉద్యమకారుడినని చెప్పుకోరని..సర్వం కోల్పోయినా లక్ష్యం వైపు వెళ్తారని చెప్పారు రేవంత్. ఉద్యమకారులని చెప్పుకునే వాళ్లకు అన్ని వేల కోట్లు- ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణతో పేగు బంధం,పేరు బంధం అన్ని తెంచుకున్నారని విమర్శించారు. దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో అన్నీ కోల్పోయారని అన్నారు.