ఉద్యమకారుల స్ఫూర్తిని కోనసాగిస్తు జిల్లా అభివృద్ధికి కృషి.
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 17(జనంసాక్షి):
తెలంగాణా సాయుధ పోరాటంలో పోరాడి అసువులు బాసిన ఉద్యమకారుల స్ఫూర్తిని కోనసాగిస్తు జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణా జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ 1947 ఆగష్టు, 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికిని హైదరాబాద్, జునాఘడ్, కాశ్మీర్ మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడ్డాయన్నా రు.తెలంగాణా లోని అప్పటి 8 జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక లోని కొన్ని ప్రాంతాలు కలిపి ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండు చేశారు. కానీ సంస్థానంలోని ప్రజలకు మాత్రం భారత దేశంలో కలవాలని ఉండేదన్నారు. దీనితో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానం పై పోరాటం చేసి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణా గడ్డ పై జాతీయ జెండా రెపరేపలాడిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్స రాలు పూర్తి చేసుకొని తెలంగాణ సమైక్య భారత దేశంలో విలీనమై 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించు కొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలుపుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని సంవత్సరాల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయగా ఉద్యమా లు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తుందన్నా రు. నాగర్ కర్నూల్ జిల్లాలో సైతం ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లా ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. దళితబంధు పథకం ద్వారా నియోజకర్గం నుండి 100 మంది చొప్పున దళిత లబ్ధిదారులను గుర్తించి రూ. 16.57 కోట్లు బదిలీ చేసినట్లు తెలిపారు.చారగొండ మండలాన్ని దళితబంధు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నా రు. రైతుబందు ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 2.88 లక్షల మంది రైతులకు రూ. 2,880.17 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమచేసినట్లు తెలిపారు. రైతు భీమా ద్వారా జిల్లాలో మరణించిన 3,780 మంది రైతుల నామినిల ఖాతాలో ఒక్కొక్క రికి 5 లక్షల చొప్పున రూ. 189 కోట్లు ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు.గొల్ల కురుమ లకు 75 శాతం సబ్సిడీ పై19,127 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలియజేసా రు.మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వంద శాతం రాయితీ పై చేప పిల్లలను చెరువులలో వదలడం జరిగిం దన్నారు. వైద్య పరంగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అచ్ఛంపే ట లో 100 పడకల ఆసుపత్రి, నాగర్ కర్నూల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూ రు అయి నిర్మాణం పూర్తి అయిందన్నారు. జాతీయ వైద్య మండలి అనుమతి పొంది 2022-23 విద్యా సంవత్సరానికి 150 మంది వైద్య విద్యార్థులకు ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు.కళ్యాణ లక్ష్మీ, కె.సి.ఆర్ కిట్ , నల్లాలు ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన తాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ మన ఊరు మన బడి కింద మొదటి విడతలో 290 పాఠశాలలకు అన్ని రకాలైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 63.60 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. నల్లమల్ల అటవీ ప్రాంతం కలిగి ఉన్న నాగర్ కర్నూల్ జిల్లాలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందు కు17 సోలార్ బోర్వెల్స్ ఏర్పాటు చేసి అటవీ సంరక్షణ కై 1000 సరిహద్దు పిల్లర్లు,82 చెక్ డ్యాములు,161 మినీ పర్క్యులేషన్ ట్యాన్కు లు 511 సాసర్ పిట్లు,2054 రాతి కట్టడాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తూన్న జిల్లా యంత్రాంగానికి, జిల్లా లో శాంతిభద్రతలు కాపాడుతున్న పోలీస్ శాఖకు అభినందన లు తెలిపారు.అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జిలా ఎస్పీ కె. మనోహర్, జిల్లా పరిషత్ చైర్మన్ పి. పద్మావతి,స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, పెద్ద కొత్తపల్లి జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్, అదనపు కలెక్టర్ మను చౌదరి, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ మోతిలాల్, డి.ఎఫ్.ఓ రోహిత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.