ఉద్యమ ఉధృతిలో ఉద్యోగుల పాత్ర చారిత్రాత్మకం
ప్రతిసారి ఐక్యతతో కదం కలిపారు
సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ వారి వల్లే విజయవంతం
అప్పటి స్వామిగౌడ్ నాయకత్వం ఆదర్శనీయం
సెప్టెంబర్ 30న ‘తెలంగాణ మార్చ్’లోనూ అదే స్ఫూర్తిని కొనసాగించండి
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్, ఆగస్టు 13 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ఉధృతమైనా ఉద్యోగులు కలిసి వచ్చిన తీరు అభినందనీయమని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చారిత్రాత్మకమైందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొనియాడారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ టీజేఏసీ ఆధ్వర్యంలో నాడు చేసిన సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యోగుల వల్లనే విజయవంతమయ్యాయని అభినందించారు. ఆ సమయంలో స్వామిగౌడ్ ఉద్యోగులకు నాయకత్వం వహించిన తీరు ఆదర్శనీయమన్నారు. ఎప్పుడు ఉద్యమ కార్యాచరణ ప్రకటించినా, ఉద్యోగులు ఐక్యంగా కదం తొక్కారన్నారు. ఈసారి కూడా అలాగే కలిసి రావాలని కోరారు. సెప్టెంబర్ 30న టీజేఏసీ నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ మార్చ్’లో కూడా ఉద్యోగులు తమ వంతుగా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉద్యమిస్తూనే కేంద్రం మెడలు వంచి తెలంగాణను సాధించుకుందామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్‌ఆకుల భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ బలోపేతానికి ఉద్యోగులు చేస్తున్న కృషిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువన్నారు. తెలంగాణ కోసం అన్ని ఉద్యమాల్లోనూ టీపీఎఫ్ పాల్గొంటున్నదని, ఇక ముందు కూడా ముందుండి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం జరిగే ఏ కార్యాచరణ అమలుకైనా టీపీఎఫ్ కలిసి వస్తుందని వివరించారు.
హైదరాబాద్, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ఉధృతమైనా ఉద్యోగులు కలిసి వచ్చిన తీరు అభినందనీయమని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చారిత్రాత్మకమైందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొనియాడారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ టీజేఏసీ ఆధ్వర్యంలో నాడు చేసిన సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యోగుల వల్లనే విజయవంతమయ్యాయని అభినందించారు. ఆ సమయంలో స్వామిగౌడ్ ఉద్యోగులకు నాయకత్వం వహించిన తీరు ఆదర్శనీయమన్నారు. ఎప్పుడు ఉద్యమ కార్యాచరణ ప్రకటించినా, ఉద్యోగులు ఐక్యంగా కదం తొక్కారన్నారు. ఈసారి కూడా అలాగే కలిసి రావాలని కోరారు. సెప్టెంబర్ 30న టీజేఏసీ నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ మార్చ్’లో కూడా ఉద్యోగులు తమ వంతుగా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉద్యమిస్తూనే కేంద్రం మెడలు వంచి తెలంగాణను సాధించుకుందామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్‌అధ్యక్షత వహించారు. తెెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ ఆకుల భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ బలోపేతానికి ఉద్యోగులు చేస్తున్న కృషిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువన్నారు. తెలంగాణ కోసం అన్ని ఉద్యమాల్లోనూ టీపీఎఫ్ పాల్గొంటున్నదని, ఇక ముందు కూడా ముందుండి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం జరిగే ఏ కార్యాచరణ అమలుకైనా టీపీఎఫ్ కలిసి వస్తుందని వివరించారు.