ఉద్యానవనాలుగా మారుతున్న స్మశానవాటికలు

 h0129gw4హైదరాబాద్‌:నగరంలోని స్మశానవాటికలన్నీ ఉద్యానవనాలుగా మారనున్నాయి. పుట్టెడు దుఖంతో వచ్చే వాళ్లకు… కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు స్మశానాలను పార్కులుగా జీహెచ్ ఎంసీ మార్చబోతుంది . నగరంలో 36 గ్రేవ్‌యార్డ్‌లను మొదటిదశలో అందంగా తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఓ స్మశాన వాటికను పైలెట్ ప్రాజెక్ట్ కింద సర్వాంగ సుందరంగా జీహెచ్ఎంసీ ముస్తాబు చేసింది.
మహాప్రస్తానం పేరుతో స్మశానం సుందరీకరణ
స్మశాన వాటికలపై ఉన్న దురాభిప్రాయాన్ని పూర్తిగా తుడిచివేయాలనుకుంటోంది జీహెచ్‌ఎంసీ. ఇకనుంచి అన్ని వ‌స‌తుల‌తో ఉన్న మోడ్రన్ గ్రేవ్‌యార్డ్‌ల‌ను రూపొందించి న‌గ‌ర వాసుల‌కు అందించాల‌ని జీహెచ్ఎంసీ 3 ఏళ్ళ క్రిత‌మే త‌లంచి… ఆచరణలో పెట్టింది. ఇందుకు పైల‌ట్ ప్రాజెక్ట్ కింద‌… ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఉన్న మూడున్నర ఎకరాల స్మశానవాటిక‌ను ఎంపిక చేసి… సర్వాంగ సుందరంగంగా తీర్చి దిద్ది… దీనికి మ‌హాప్రస్థానం అనే పేరును కూడా పెట్టింది.
కాంట్రాక్ట్‌ తీసుకున్న ఫినెక్స్‌ ఫౌండేషన్‌…ఈ పార్క్‌లోకి అడుగుపెట్టగానే, గొప్ప అనుభూతి క‌లిగేలా తీర్చి ఫినెక్స్‌ ఫౌండేషన్‌ వారు. మహాప్రస్థానం పేరుతో బల్దియా రూపొందించిన ఈ మోడ్రన్‌ గ్రేవ్‌యార్డ్‌ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రులు సోమవారం ప్రారంభించారు. మన స్మార్ట్ సిటీలు, వరల్డ్ క్లాస్ సిటీలకు ఆదర్శంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి గ్రేవ్‌యార్డ్‌లు నిర్మించేందుకు కేంద్రం దగ్గరకు ప్రతిపాదనలు పెడతామని వెంకయ్యనాయుడు అన్నారు.
మంచినీరు, క్యాంటిన్‌ సౌకర్యాలు….
ఇక్కడ మంచినీటి సౌక‌ర్యంతో పాటు క్యాంటీన్‌, స్నానాల‌కు ఏర్పాట్లు, స్త్రీలు, పురుషులు విడివిడిగా దుస్తులు మార్చుకునే ఏర్పాట్లు చేశారు. రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ద‌హ‌నానికి ఎల‌క్ట్రిక‌ల్ క్రిమియేష‌న్ యంత్రాన్నీఅందుబాటులో ఉంచారు. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా అస్థిక‌లు, బూడిద‌ను వేరు చేసి భ‌ద్రప‌రుస్తారు. పూర్తి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా… 36 మోడ్రన్ శ్మశాన‌ వాటికల‌ను ఏర్పాటు చేస్తామ‌ని అధికారులు చెబుతున్నారు. దూర‌ప్రాంతాల్లోనివారు వైఫై ద్వారా ప్రత్యక్షంగా కార్యక్రమం వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలాంటి మోడ్రన్ స్మశానాలను నగరంలో ఇంకా 50కిపెంచాలని రాష్ట్ర మంత్రులు కోరారు.

 

 

 

 

900 స్మశానాల ప్రక్షాళనకు ప్లాన్‌…..
నగరంలో ఇప్పటికే 900 గ్రేవ్ యార్డ్స్ ఉండగా వాటి ప్రక్షాళనకు ప్లాన్ చేస్తుంది జీహెచ్‌ఎంసీ. మొత్తానికి హైదరాబాద్‌లో స్మశానాలన్నీ… అందమైన పార్కులుగా మారబోతున్నాయి.