ఉద్యోగాల జాతర

60 వేల కొలువులు, 20 వేల ఉపాధ్యాయ పోస్టులు
నెలాఖరుకు నోటిఫికేషన్‌ : సీఎం
కాకినాడ, జూన్‌ 23 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాల జాతర తెరలేపింది. త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 60 వేల ఉద్యోగాలతో పాటు 20 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఏడాది 60 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పారు. ఈ నెలాఖరుకు 20 వేల ఉపాధ్యాయుల నియామకం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని చేప్పారు. కడప ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. బంగారుతల్లి పథకం ఆడపిల్లలకు ఓ వరమని పేర్కొన్నారు. గత రెండేళ్లలో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. చదివించడమే తల్లిదండ్రులు పిల్లలకు ఇచేఉ్చ పెద్ద ఆస్తి అని సీఎం అన్నారు.