ఉద్రిక్తంగా మారిన గుడిసెల తొలగింపు
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లలో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వేసిన గుడిసెలను పోలీసులు తొలగించేందుకు వచ్చారు. అయితే వారిని స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వటంతో ఆలమూరు ఎస్‌ఐ విద్యాసాగర్ గాయపడ్డారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.