ఉధృతంగా ప్రవహిస్తున్న గాంధారి పెద్దవాగు నిండుకుండలా చెరువులు

_ జనంసాక్షి జూలై 13
 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గాంధారి మండలం లో గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కావున రైతన్నలు జోరుగా వరినాట్ల లో మునిగిపోయారు చెరువులు బావులు బోర్లు నిండుగా వర్షం రావడంతో గాంధారి మండలం లో వివిధ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గాంధారి మండల ఎస్సై సాయిరెడ్డి  తన సిబ్బందితో వాహనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా మండలంలో వివిధ గ్రామాలలోకి తిరిగి వాగులు చెరువులు చూసి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉందేమో దగ్గరుండి తెలుసుకుంటున్నారు అదేవిధంగా శిధిలావస్థలో ఉన్న ఇల్లు చూసి తగు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు మరియు అత్యవసర సమయంలో 100 కి ఫోన్ చేయండి అని వివరించారు