ఉన్నతవిద్య పరిశోధన బిల్లు రద్దు చేయాలి

తిరుపతి, జూలై 11 : ఉన్నతవిద్య పరిశోధన బిల్లు 2011ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తిరుపతి అర్బన్‌ జిల్లా న్యాయవాదుల సంఘం బుధవారం నాడు కోరింది. అదే విధంగా ఉన్నత విద్య పరిశోధన బిల్లును కూడా ప్రభుత్వం రద్దు చేయాలని కోరింది. ఈ సందర్భంగా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదులు కోర్టు ఆవరణ నుంచి టౌన్‌ క్లబ్‌ వరకు ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం న్యాయవాదులు విధుల్లో జోక్యం చేసుకోవద్దంటూ నినాదాలు ఇచ్చారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సురేంద్రబాబు, ఎ.కె.రెడ్డి, శ్రీనివాస్‌, భారీ సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ట్రాఫిక్‌ను తొలగించారు.