ఉపాది హామీ పటిష్టంగా కొనసాగించండి – మంత్రి కేటీఆర్
తిరువనంతపురం,జనవరి6(జనంసాక్షి) : ఉపాది హామీ చట్టాన్ని పటిష్టంగా కొనపాగించి గ్రామీణ వలసలను ఆపాలనీ పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ది, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామరావు అన్నారు. 95శాతం గ్రావిూణ కుటుంబాలు ఉపాధిహావిూ పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధార పడ్డాయన్నారు. ఈ పధకాన్ని పరిమితం చేస్తే విపరీత దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహావిూని మరింత వినూత్న పద్దతుల్లో సరికోత్త ప్రయోగాలతో అమలు చేయాలన్నారు. ఉపాదీహవిూ పధకాన్ని కేంద్రం కుదిస్తుందన్న వార్తలు తమకు అందోళన కలిగిస్తున్నాయని మంత్రి తెలిపారు. దక్షిణాది రాష్టాల్ర గ్రావిూణాబివృద్ది,పంచాయితీ రాజ్ శాఖ మంత్రులతో కేంద్ర ప్రభుత్వ గ్రావిూణాబివృద్ది శాఖ కేరళలోని కోవలంలో జాతీయా ఉపాదిహవిూ పధకంపై నిర్వహించిన సదస్సులో తారకరామారావు పాల్గోన్నారు. దేశ చరిత్రలో మొదటి సారి పేదలకి, బలహీన వర్గాలకి ఈ పథకం నిజమైన ఆదరణను కల్పించదన్నారు. 95 శాతం గ్రావిూణ కుటుంబాలు ఉపాధిహవిూ పై ప్రత్యక్షంగానక్ష పరోక్షంగానో ఆదార పడ్డాయని తెలిపారు. ఇలాంటి పధకాన్ని పరిమితం చేస్తే విపరీత దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ శాశనసభ ఉపాదిహావిూ పై కేంద్రం ఏలాంటి పరిమితులు విధించరాదని తీర్మాణం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున ఉపాధిహావిూ మరింత వినూత్న పద్దతుల్లో సరికోత్త ప్రయోగాలతో అమలు చేయాలని కోరారు. గత 8సంవత్సరాల్లో ఉపాధిహావిూ గ్రావిూణాబివృద్దిలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందన్నారు. తెలంగాణలో 9జిల్లోల్లోని 443 మండల్లాల్లో ఉపాధిహావిూ అమలు చేస్తున్నామని, ఇప్పటిదాక వంద కోట్ల పనిదినాలను 9800 కోట్లతో కలిపించామన్నారు. సుమారు 25లక్షల కుటుంబాలకి ప్రతి ఏడాది పని కల్పిస్తున్నాం. ఇందులో 95 శాతం యస్‌సి, యస్‌టి, బిసి వర్గాలో ఉన్నాయి. ఉపాధిహావిూ వల్ల వంద రోజుల పనితో పేదల ఆకలికి భద్రత అవకాశం కలిగిందన్నారు. 30 రూ. ఉన్న దినసరి కూలీ 150 కి పెరిగింది. గ్రావిూణ వలసలు 44 శాతం తగ్గాయి. పెరిగిన కూలీలతో గ్రావిూణ ప్రాంతాల్లో సరాసరి క్రెడిట్ వర్ధీనెస్ 6500 నుండి 32000 కి పెరిగింది. 1.95 లక్షల ఎకరాల హర్టీ కల్చర్ తోటల పెంపకం, 8.5 కోట్ల బండ్ ప్లాంటెషన్, జరిగింది. ఉపాధిహావిూ వల్ల చెరువుల పునరుద్దరుణ జరిగింది. 46,215 చెరువుల పునరుద్దరుణ పనులు జరుగుతాయి. గ్రామాలకి రోడ్డు కనెక్టీవిటి పెరిగింది. 6,109 అవాసాల నుంచి 9638 కీమి కోత్త రోడ్డు వేయడం జరిగింది. దీంతో 1442 నూతన అవాసాలకి 1768 కీవిూ రోడ్డు వేయడం జరిగింది. గ్రావిూణ ప్రాంతాల్లోని దళిత వాడలకి మరుగుదొడ్డి సౌకర్యాలు, 1276 కిమి సిసి రోడ్లు వేయడం జరిగింది. 3 లక్షల మరుగుదోడ్లుపూర్తయ్యాయి. 2.44 లక్షల నిర్మాణంలో ఉన్నాయి. దీంతో పాటు ఉపాధిహావిూ లో రాష్ట్రంలో పాటిస్తున్న పలు పద్దతులను మంత్రి కెటిఆర్ వివరించారు. ఇందులో ట్రాన్సాక్సన్ బేస్డ్ సాప్ట్ వేర్‌తో ఏలాక్టాన్రిక్ ఫండ్ మేనేజ్‌మేంట్ సిస్టమ్ ద్వారా నేరుగా కూలీ సొమ్ములను శ్రమ శక్తి సంఘాల ఖాతాల్లోకి పంపడం, బయోమెట్రిక్ సిస్టమ్, సోషల్ అడిట్ వంటి విధానాలను ఇతర రాష్టాల్ర మంత్రులకి వివరించారు. ఇంత గొప్పగా ఉపాధిహవిూ పథకం నడుస్తున్నప్పటికి, వేతన చెల్లింపుల్లో అలస్యం, వేతనాల్లో అవకతవకలు, ఆస్థుల రూపకల్పన, ఉపాదీహావిూ లో పంచాయితీ రాజ్ సంస్థల భాగస్వామ్మం పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందన్నారు. ఇలాంటి అంశాల విూద మరింత పరిశోధన జరిపి ఉపాధిహావిూ పథకాన్ని మరింతగా బలోపేతం చేయాలన్నారు. వివిధ రాస్ట్రాల మంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు.