ఉపాది హామీ పథకంలో జరిగిన పనుల వివరాలను తెలపండి

…..ఆర్టిఐ ద్వారా సమాచారాన్ని కోరిన కింది గేరి స్వామి
పాన్ గల్ జులై 26( జనం సాక్షి )
 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిబంధనల ద్వారా మంజూరైన జాబ్ కార్డుల వివరాలు జరిగిన పని దినాలు, మరియు వాటి వివరాల పూర్తి సమాచారాన్ని తెలియజేయాలని మంగళవారం రోజు సమాచార హక్కు చట్టం ద్వారా పౌర సమాచార అధికారి నాగేశ్వర్ రెడ్డి కి కింది గిరి స్వామి దరఖాస్తు చేశారు. పాన్ గల్ గ్రామపంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెరువుల్లో, కుంటలలో పూడికతీత పనుల్లో, మరియు హరితహారం పనులలో, గత మూడు నెలలుగా ఎంతమంది కూలీలు మరియు కల్పించిన మొత్తం పని దినాలు మరియు పూర్తి సమాచారాన్ని తెలియజేయాలని, అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 18 సంవత్సరాల నిండిన యువతి యువకులకు వారి తల్లిదండ్రుల జాబ్ కార్డులలో పేర్లు ఎంట్రీ చేసి, అట్టివారికి పనులు కల్పించాల్సి ఉండగా, అధికారులు మాత్రం ఒంటరిగా జాబ్ కార్డులు ఇచ్చి, పనులు కల్పిస్తూ ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారని, ఒంటరిగా జాబ్ కార్డులను పొందిన యువతి యువకుల పూర్తి సమాచారము వారి పేర్లు తో సహా ఎంత మంది ఉన్నారో సమాచారము తెలియజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసినట్లు కిందిగేరి స్వామి తెలిపారు.
Attachments area