ఉపాధి పనులను పరిశీలించిన ఎంపిడివో
కందుకూరు, జూలై 18 : వివిపాలెం మండల పరిధిలోని శింగమేని పాలెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపిడివో మాలకొండయ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మస్టర్లను ఆయన పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.