ఉపాధి హామీ గ్రామీణ పేదలకు వరం
* గ్రామీణ అభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి హెచ్ ఆర్ మీనా
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
ఉపాధి హామీ పథకమును సక్రమంగా ఉపయోగించుకుంటే పేదలకు, కూలీల జీవనోపాధి మెరుగవడమే కాకుండా ఆర్థికంగా బలపడవచ్చని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి హెచ్ ఆర్ మీనా పేర్కొన్నారు.
శుక్రవారం సైదాపూర్ మండలం లోని
ఎలబోతారం, వెన్నంపల్లి గ్రామాలలో ఉపాధి హామీ లో చేపట్టిన కందకాలు, చెరువుల పూడిక తీత, మొక్కల పెంపకం, కంపోస్టు షెడ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు వరం లాంటిదని పేర్కొన్నారు. చిగురుమామిడి, సైదాపూర్ గ్రామాలలో వివేక్ రాజ్ ప్రాజెక్టు మేనేజర్, పంకజ్ శర్మ బృంద సభ్యులు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి వివిధ అభివృద్ధి పనులను, సంబంధిత రికార్డును బృంద సభ్యులు పరిశీలించారు. కూలీలకు ఉపాధి హామీ కల్పనా పనుల చర్చించారు జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు నిర్వహిస్తున్న రికార్డుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉప కమిషనర్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఏ.పద్మ, సింగిల్విండో చైర్మన్ వెంకట్ రెడ్డి, అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ సంధ్యారాణి,ఏపిడి కృష్ణ ఎంపిఓ తదితరులు పాల్గొన్నారు.