ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

-ఫిర్యాదు కేంద్రాన్ని ప్రారంభించిన న్యాయ విచారణ అధికారి
*******
సైదాపూర్ జనం సాక్షి సెప్టెంబర్ 22 మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ విచారణ అధికారి ఆడపు లక్ష్మీనారాయణ (అంబుడ్స్ మెన్ )విజ్ఞప్తి చేశారు. గురువారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ఉపాధి హామీ ఫిర్యాదుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఉపాధి హామీ కూలీలు ఏదైనా ఇబ్బంది తలెత్తితే వారి ఫిర్యాదును ఫిర్యాదుల బాక్స్ లో వేయాలని అట్టి సమస్యను అధికారులు సత్వరమే పరిష్కరిస్తారని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను ముందుగా గుర్తించి అనుమతి పొంది పనులు నిర్వహించాలని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ముందుకు తీసుకు పోవడంలో డి ఆర్ డి ఓ పి డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఉపాధి హామీకి సంబంధించిన ఏడు రికార్డులను గ్రామపంచాయతీలోనే అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పద్మావతి, సర్పంచ్ కాయిత రాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, వార్డు సభ్యులు సురేష్,అంగన్వాడి టీచర్ స్వరాజ్యం, ఆశ కార్యకర్త నిర్మల,మేటీ రేగుల మహేందర్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.