ఉపాధ్యాయుల కొరత…రోడ్డెక్కిన విద్యార్థులు…వర్గ విభేదాలే కారణమా?

 

కొత్తగూడ ఆగస్టు 10 జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పోనుగొడు ప్రభుత్వ పాటశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా రోడ్డెక్కిన విద్యార్ధులు…విద్యార్థులు మాట్లాడుతూ మా పాఠశాలలో వెంటనే ఉపాధ్యాయులను నియమించి మా భవిష్యత్తును కాపాడాలని గూడూరు జాతీయ రహదారిలో గంట పాటు మండుటెండలో విద్యార్థుల భారీ రాస్తారోకో నిర్వహించారు.పోనుగొడులోని దత్తత ప్రభుత్వ పాటశాలలో వర్గ విభేదాలు,డొనేషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని విద్యార్థులు కొన్ని రోజుల క్రితం చేసిన ఆందోళనకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను తొలగింపు…పాఠశాలలో ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్థానిక ఎంఈఓ,డిఇఓ లతో మొదలుపెట్టుకొని ఎమ్మెల్యే వరకు మొరపెట్టుకున్న వారి అభ్యర్థన ఫలించకపోవడం పై అనేక అనుమానాలకు తావితీస్తుంది.520 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు కావడంతో ఏమి చేయలేక సందిగ్ధంలో పడిపోయారు.ఏదేమైనా వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించి మా భవిష్యత్తును కాపాడాలని విద్యార్థుల డిమాండ్…ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించి ఇరవై రోజులవుతున్న హాజరు కానీ వైనం…ఉన్నవారిని తొలగించి కొత్తగా ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించిన హాజరు కాకపోవడంలో ఆంతర్యము ఏంటని పలు అనుమానాలు…ఏదేమైనా వెంటనే ఉపాధ్యాయులు నియమించి మా భవిష్యత్తును కాపాడాలని,విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న గూడూరు విద్యాశాఖ…పొనుగోడు పాఠశాల పై ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కలెక్టర్ ను కోరారు.

తాజావార్తలు