ఉపాధ్యాయ ఉద్యమ కెరటం నాగటి నారాయణ సేవలు చిరస్మరణియం

టీ ఎస్ యూ టీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీ కృష్ణ.

తొర్రూరు 20 అక్టోబర్ (జనంసాక్షి )
ఉపాధ్యాయ ఉద్యమ కెరటం నాగాటి నారాయణ సేవలు చిరస్మానియమని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ అన్నారు. గురువారం టీ ఎస్ యూ టీ ఎఫ్ సీనియర్ నాయకుడు అమరజీవి నాగటి నారాయణ  సంస్మరణ సభ జిల్లా కార్యదర్శి  కే బిక్షపతి  అధ్యక్షతన తొర్రూరు పట్టణ కేంద్రములో జరిగింది.
ఈ సంస్మరణ సభకు జిల్లా అధ్యక్షులు  ఏ. మురళీ కృష్ణ   హాజరై నారాయణ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ, నారాయణ  యూ టీ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా, JAC కో-చైర్మన్ గా సుదీర్ఘ కాలం పని చేసి ఎన్నో చారిత్రక పోరాటాలకు నేతృత్వం వహించి ఉపాధ్యాయ, ఉద్యోగ చరిత్రలో తనదైన ముద్రవేశారని, తుదకంటా నిరాడంబరంగా జీవించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారని, విలువలతో కూడిన ఉద్యమాలను నడిపించారని, పదవి విరమణ అనంతరం కూడా తల్లిదండ్రుల సంఘం ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నో ప్రతినిధ్యాలు చేశారని, విద్యా రంగం పట్ల ఒక స్పష్టమైన అధ్యయనంతో చాలా దినపత్రికలకు వ్యాసాలు రాసేవారని ఆయన అకాల మృతి ప్రభుత్వ విద్యారంగానికి, ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని అన్నారు. డి ఎస్ సి 2003 స్పెషల్ విద్యా వాలంటిర్లను రెగ్యులర్ టీచర్లు గా గుర్తింపు తీసుకొచ్చి వారికి నోషనల్ ఇంక్రిమెంట్ సాధించడం లో, ఉపాధ్యాయులకు పి ఆర్ సి లో మెరుగైన ఫిట్మెంట్ సాధించడంలో , అనేక విద్యారంగ సమస్యల పరిష్కారం లో ముందుండి పోరాడి సాధించారని అన్నారు. ఈ రోజు ఆయన భౌతికంగా లేకపోవడం విద్యా రంగానికి తీరని లోటని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.
ఈ సమావేశంలో టి ఎస్ యూ టీ ఎఫ్ జిల్లా కోశాధికారి నాగ మల్లయ్య,  జిల్లా కార్యదర్శి ఎర్ర వెంకన్న,తొర్రూరు, పెద్ద వంగర, నరసింహుల పేట, దంతలపల్లీ,నెల్లికుడుర్ బాధ్యులు రమేష్, జనార్ధన్, వెంకటేశ్వర్లు, యకయ్య,వంశీకృష్ణ, చైతన్య, రంజిత్ ,యాకూబ్ ,మురళీ, లింగరాజు,విజయ్, వెంకన్న తదితరులు పాల్గొని నివాళులు అర్పించి నారాయణ గారితో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.


Sent from Email.Avn for mobile

Attachments area