ఉభయకమ్యూనిస్టుల ఉద్యమాన్ని జీర్ణించుకోలేని టిడిపి

ప్రత్యేక¬దాపై ఒంటరి పోరాటలు బిజెపికే లబ్ది

జనసేనతో లెఫ్ట్‌ కలయికతో ఉధృతం అయిన ¬దా ఉద్యమం

అమరావతి,జూలై6(జ‌నం సాక్షి): ప్రత్యేక¬దా ఉద్యమాన్ని మళ్లీ జీవించేలా చేసి ముందుకు తీసుకుని వెళ్లడంలో ఉభయ కమ్యూనిస్ట్‌ పార్టీలు చైతన్యంగా పనిచేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ రంగంలోకి దిగాకఆయనకు పూర్తి ద్దతు ఇస్తూనే తమవంతుగా ప్రత్యేక¬దా, కడప ఉక్కు, రైల్వేజోన్‌ అంశాల్లో ప్రజలతో మమేకమై ఉద్యమిస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రాజకీయ సదస్సులోజనసేన, ఆమాద్మీ పార్టీ, లోక్‌సత్తా, రిపబ్లికన్‌ పార్టీ, ఎంసిపిఐ తదితర పక్షాల నాయకులు కూడా హాజరైనారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను పెంపొందించాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది. ఇందుకోసం విభజనానంతర సమస్యలు, ప్రత్యేక ¬దా సాధన, ప్రభుత్వ విధానాలు,తదితర అంశాలన్ని టినీ చర్చించి ఒక సమగ్ర ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. అయితే ఇటీవలి కాలంలో వామపక్షాల ఆధ్వర్యంలో అనేక సదస్సులు లేదా సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో టిడిపి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లడంలో లెఫ్ట్‌ నేతలు బాగా కృషి చేస్తున్నారు. అలాగే ప్రత్యేక ¬దాను నిరాకరించిన కేంద్రాన్ని కూడా నిశితంగా విమర్శిస్తూ ఎక్కడిక్కడ ఎండగడుతున్నారు. అయితే కమ్యూనిస్టుల పోరాటాలపై, కార్మిక ఉద్యోగ ఉద్యమాలపై నిర్బంధం ప్రయోగిస్తున్న ప్రభుత్వం, తమకు ఎక్కడ ముప్పు ఉంటుందో అన్న బెంగతో అణచివేతకు పాల్పడుతోంది. ప్రత్యేక ¬దాతో సహా విభజన హావిూలు ఎందుకు అమలు కాలేదో నాలుగేళ్ల పాటు బిజెపితో ఎందుకు అంటకాగారో చెప్పాలన్న ప్రశ్నలకు టిడిపి ఎదురుదాడి చేస్తున్నదే తప్ప సరైన సమాధానం ఇవ్వడం లేదు. సరికదా కనీసం విభజన సమస్యలపై అయినా ఉమ్మడి పోరాటాలకు కసలి రావడం లేదు. ఎన్నికల ప్రణాళికలో ఆ మేరకు హావిూ ఇచ్చిన బిజెపి ప్రత్యేకించి ప్రధాని మోడీ అమలు చేయకపోవడం వల్ల పోరాటాలు అనివార్యం అయ్యాయి. అయితే ఎపిలో ఉమ్మడి పోరాటాలకు వేదిక లేకపోవడం, ఎవరికి వారే పోరాటాలు చేయడం కారణంగా బిజెపికి కలసి వస్తోంది. టిడిపి కూడా కేవలం బిజెపినే తిడుతూ పోవడం వల్ల ఇది కేవలం ఇరు పార్టీల వ్యవహారంగా మారింది. దీంతో బిజెపి ఎదురుదాడి చేస్తూ టిడిపిని దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయ పావులు కదుపుతోంది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ఉమ్మడి పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులను విశ్వసించి వారిని కలుపుకుని పోయివుంటే బాబు చేస్తున్న విమర్శలకు బలం చేకూరేది. అందుకే బిజెపి వీరిద్దరి మధ్య తన రాజకీయ పబ్బం గడుపుకొంటుంది. మరోవైపు వైకాపా ప్రత్యేక¬దా కోసం పోరు ఉధృతం చేయడంతో విధిలేకనే టిడిపి యుటర్న్‌ తీసుకుని కేంద్రం నుంచి బయిటకు వచ్చింది. ఇప్పుడైనా సరే కేంద్రం తిరస్కరణకు వ్యతి రేకంగా రాష్ట్రమంతటి తరపున ఉమ్మడిగా పోరాడే బదులు కేవలం తెలుగుదేశం జెండాలతో చేస్తున్న పోరాటాల కారణంగా సమస్య తీవ్రతను ఐక్యంగా ప్రదర్శించలేక పోతున్నారు. ఇదంతా కేవలం ఎన్నికల డ్రామాగా కేంద్రం చూస్తోంది.జాతీయ ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తామని అంటున్న బాబు కమ్యూనిస్టుల పోరాటాలను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. వారిని చేరదీసి ఉద్యమాలను ఉధృతం చేయకపోవడం వెనక తన రాజకీయ లబ్ది ఉందని అందిరీకి తెలిసిందే. ఇలాంటి అవకాశవాద రాజకీయాల నేపథ్యంలో వామపక్ష పార్టీల ఐక్య పోరాటాలు ప్రాధాన్యతను సంతరించు కుంటున్నాయి. జనసేన, కమ్యూనిస్టులు కలసి పని చేస్తే తమకు ఎక్కడ ముప్పు ఉందో అన్న అభద్రతలో టిడిపి నేతలు పోరాటాన్ని అపహాస్యం చేస్తున్నారు. కమ్యూనిస్టులు, జనసేన ఇతర రాజకీయ శక్తులు కలసి చేస్తున్న పోరాటాలను స్వాగతించి విభజన హావిూలను అమలు చేసేలా టిడిపి సహా అందరూ కలసి వస్తేనే ప్రయోజనం చేకూరగలదు.