ఉమమడి జిల్లాలో ప్రచార¬రు


ప్రాదేశిక ఎన్నికల్లో జోరు పెంచిన గులాబీ నేతలు
గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ప్రచారం
నిజామాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  డిసెంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో పాటుగా జీపీ ఎన్నికల్లో సాధించిన గెలుపుతో గులాబీ పార్టీ మరింత జోరు పెంచింది. ప్రజల మద్దతుతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ పార్టీకి వరుస ఎన్నికల్లో గెలుపు బాటను కొనసాగించేలా స్థానిక పోరులోనూ జెండా రెపరెపలాడేలా నాయకత్వం గట్టిగా పాటుపడుతోంది. వరుస ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన తెలంగాణ రాష్ట్ర సమితి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమదైన రీతిలో ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో వరుసగా గెలుపు ఉత్సాహంతో ఉన్న క్యాడర్‌ సైతం ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరులో గులాబీ జెండాను ఎగురవేసేందుకు సిద్ధం అవుతున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మార్గనిర్దేశనర ప్రకారం ఎమ్మెల్యేలు స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
జడ్పీ పీఠం కైవసం చేసుకోవడంతో పాటుగా మండల పరిషత్‌లోనూ గులాబీ జెండా ఎగురేయాలన్న లక్ష్యంతో అంతా కదులుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్‌ పీఠాలపై టీఆర్‌ఎస్‌ పాగా వేయాలన్న సంకల్పంతో ముందుకు పోతున్న దరిమిలా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలంతా పట్టుదలతో స్థానిక పోరుపై దృష్టి పెట్టారు. ఎంపీ ఎన్నికల్లో సమష్టిగా పని చేసినట్లుగానే పరిషత్‌ ఎన్నికల్లోనూ అదే రకంగా పని చేసి ప్రతిపక్ష పార్టీలకు అందనంత ఎత్తులో దూసుకుపోవాలని భావిస్తోంది. కామారెడ్డి జిల్లా తొలి జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేం దుకు తెలంగాణ రాష్ట్ర సమితి పక్కా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతోంది. టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగారు. ప్రతీ గడపకు వెళ్లి ఒక్కొక్కరిని కలుస్తూ ఓటు అభ్యర్థిస్తూ… ప్రచారం చేస్తున్నారు. ఎంపీటీసీలకు గ్రామ స్థాయిలో, జడ్పీటీసీలకు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నాయకు లందరినీ కలుపుకొని పోయేలా వ్యూహాలు పన్నుతున్నారు. గ్రామాల్లోని ప్రతీ గడపను తాకుతూ ఓటర్లను కలుస్తున్నారు. వరుసగా ఎన్నికలు రావడం, అన్నింట్లోనూ కారు ¬రెత్తడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. అసెంబ్లీ, పంచాయతీ, ఎంపీ ఎన్నికల్లో చూపించిన తెగువనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రదర్శిస్తున్నారు.అసెంబ్లీ, పంచాయతీ తరహా ఫలితాలే పునరావృతం అవుతాయని అంతా భావిస్తున్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ బలంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతు న్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు పట్టణ ప్రాంతాల కంటే గ్రావిూణ ప్రాంతాల్లోనే భారీ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన గ్రావిూణ ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని నాయకులు చెబుతున్నారు. దీంతో మొత్తంగా జిల్లా మొత్తం ఎన్నికల వాతావరణం విస్తరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులంతా కదనరంగంలో దూకి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  మొదటి విడత పోలింగ్‌ తేదీ మే 6 దగ్గర పడుతున్నందున నామినేషన్లు వేసిన వారంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పోలింగ్‌ నాటికి ప్రజల మనసులు దోచుకుని ఓట్లు రాబట్టుకునే పనిలో వారంతా నిమగ్నం అయ్యారు. మూడో విడతలోనూ ఆశావహులంతా ముందస్తుగానే ఓటర్లను కలుసుకుంటూ వారి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.