ఉమామహేశ్వర క్షేత్రానికి వెండి ఆభరణాలు బహుకరించిన దడువై రవికుమార్ దంపతులు

ఆర్సి, ఆగస్టు 25( జనం సాక్షి న్యూస్) : నియోజకవర్గం లోని శ్రీశైల ఉత్తర ద్వారం అయిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర ఆలయంలోని మహిషాసుర మర్దిని అమ్మవారికి సుమారు నాలుగు లక్షల రూపాయలకు పైగా విలువైన ఆరు కిలోల వెండి తొడుగు తాంబాలం లను రంగారెడ్డి జిల్లా దుబ్బచెర్ల గ్రామం వాస్తవ్యులు దడువై రమేష్ కుమార్ జ్యోతి దంపతులు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ చైర్మన్ కందూరి సుధాకర్ చేతుల మీదుగా బహూకరించారు. ఈ సందర్భంగా దాతలు రమేష్ కుమార్ జ్యోతి లు మాట్లాడుతూ.. ఉమామహేశ్వర దేవస్థానం గతంలో కంటే ఇప్పుడు భక్తులకు వసతులు కల్పించడంతో పాటు భక్తులకు వసతి గదుల ఏర్పాటు ,ఒక పూట నిత్య అన్నదానం, పార్కింగ్ షెడ్ ,సీసీ కెమెరాలు, ఒక పూట నిత్య అన్నదానం, సిసి రోడ్లు ,పరిశుభ్రత, ఇలా  ఆహ్లాద భరితంగా ఆలయ పరిసరాలను సుందరీకరిస్తూ చేస్తున్న పనులలో అభివృద్ధి పురోగతిలో ఉందని ఆలయ చైర్మన్ చేస్తున్న సేవలను  కొనియాడారు. అనంతరం దాతలకు వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్ మాట్లాడుతూ ఆలయ నియమ నిబంధనలను అభివృద్ధిని చేయుటకు భగవంతుని ఆశీస్సులతో కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసులు అర్చకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.