ఉమ్మడి నీట్‌ నిర్వహించండి

2

– సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు) నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విధానాన్ని అన్ని రాష్టాల్ల్రో అమలు చేయాల్సిందేనని పేర్కొంది. ఈమేరకు గురువారం తీర్పు వెలువరించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే నీట్‌ పరీక్ష నిర్వహించాలని పేర్కొంది. మే1న, జూలై 24న రెండు విడతలుగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సూచించింది. ఆగస్టు 17న నీట్‌ ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. సెప్టెంబర్‌ 30 నాటికి కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలని పేర్కొంది. అక్టోబర్‌ 1న తరగతులను ప్రారంభించాల్సిందేనని ఖరాకండిగా తేల్చి చెప్పింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌) నిర్వహణపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నీట్‌ నిర్వహణపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో ఎంసెట్‌ నిర్వహణపై స్టే ఇచ్చేందుకు కోర్టు అంగీకరించలేదు.