ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉద్రిక్తంగా వీఆర్ఏల కలెక్టరేట్ల ముట్టడి

గద్వాల నడిగడ్డ, జులై 23 (జనం సాక్షి);
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా శనివారం ఉద్రిక్తంగా మారాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లా తో పాటు నాగర్ కర్నూల్, గద్వాలలో కూడా పోలీసులకు వీఆర్ఏలతోపాటు ప్రజాసంఘాల నాయకులతో తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు 4వ రోజు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి లో భాగంగా శనివారం ఆయా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించినట్లు వీఆర్ఏలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేలు, ఉమ్మడి పాలమూరు ఆయా జిల్లాలో 3171 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారనీ రాష్ట్రంలో వీఆర్ఏలకు అర్హత ఉన్న పదోన్నతులు కల్పించడం లేదని, 55 సంవత్సరాల పైబడిన విఆర్ఏ ల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని, అకాల మరణం చెందిన వీఆర్ఏల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని మేము చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమే కానీ కెసిఆర్ మాత్రం అమలు పరచడం లేదని వీఆర్ఏల శోకానికి కారణమైన కేసీఆర్ పథకం తప్పదని జోగులాంబ గద్వాల జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి ఎం.సీ.కేశవరావు, సిఐటియు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ గద్వాల టౌన్ ఎస్ఐ ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని వీఆర్ఏలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తిస్తూ వీఆర్ఏలను కాలితో తన్నడం, బట్టలు చించడం, గొంతు పట్టడం, మహిళలు అని కూడా చూడకుండా తోసి వేయడం ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే పోలీసు ఉన్నతాధికారులు టౌన్ ఎస్ఐ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లా లలో విఆర్ఏలు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.