ఉరుసు కుమ్మరి వాడలో ఉచిత కంటి పరీక్ష శిబిరం

వరంగల్ ఈస్ట్ ,జూలై 30 (జనం సాక్షి)
లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ మరియు శరత్ మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా వరంగల్ పట్టణంలోని ఉర్సు, కుమ్మరి వాడలో శనివారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించాయి.ఈ ప్రారంభ శిబిరానికి లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ అధ్యక్షులుపరశురాములు అధ్యక్షత వహించారు.
 ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా పాస్ట్ జిల్లా వైస్‌ గవర్నర్‌ ఎన్‌.వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రతి మనిషి రోజూ కళ్లను సంరక్షించుకోవాలని, నిరంతరం టీవీలు, స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్లు చూడటం వల్ల కళ్లపై ప్రభావం పడుతుందని, కంటి చూపు బాగుండాలంటే పచ్చి కూరగాయలు, పప్పులు , గుడ్లు  మొదలైనవి తినాలన్నారు. మా లయన్స్ క్లబ్‌లు కార్యకలాపాల ప్రకారం ఐదు రంగాలలో నిరుపేదలకు సేవలందిస్తున్నాయి మధుమేహం , పర్యావరణం , ఆకలి ఉపశమనం , కంటి చూపు , చైల్డ్ హుడ్ క్యాన్సర్. ప్రజలు ఉచితంగా అందించిన లయన్స్ క్లబ్ సేవలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి అని అన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ అధ్యక్షుడు మండల పరశురాములు ఈ సందర్భంగా  మాట్లాడుతూ పౌరులకు మెరుగైన వైద్యం కోసం తూర్పు నియోజకవర్గం మొత్తం మెగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు.
 ఈ శిబిరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ వైస్ ప్రెసిడెంట్ కందికొండ.కుమారస్వామి, కంటి శిబిరం ఇంచార్జిలు లయన్ బైరి.హరినాథ్,కుమారస్వామి,
 మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాజగోపాల్, జెడ్సీ డాక్టర్ మోహన్ రావు, లయన్ కె.నవీన్ రెడ్డి, కార్యదర్శి నాసం.ప్రవీణ్  స్థానిక కార్పొరేటర్ మరుపాళ్ల.రవి, ఆత్మీయ క్లబ్ అధ్యక్షుడు చల్ల.రఘునాథ్ రెడ్డి, శామ్యూల్, సీనియర్ లయన్ ఎన్.సుధాకర్వరెడ్డి, స్థానిక శాలివాహన సంఘం  నాయకులు పాల్గొన్నారు.  ఈ శిబిరంలో మొత్తం 76 కేసులను పరీక్షించగా, ఇందులో 12 కేసులను కంటిశుక్లం ఆపరేషన్ల కోసం గుర్తించారు.