ఊపిరి విడిచిన జర్నలిస్ట్ రాధాకృష్ణ.

మందమర్రి సిటీ కేబుల్ సీనియర్ జర్నలిస్ట్ ల సెగ్గ్యం రాధాక్రిష్ణ(53) ఊపిరి విడిచారు,రెండున్నర దశబ్దాలు గా మీడియా రంగంలో ఉన్న రాధాకృష్ణ గత ఏడాది కాలంగా అనారోగ్యం గా ఉన్నారు.ఆయనకు ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారు. పిల్లల్ని చాలా కష్టపడి చదివించాడు.శనివారం రాత్రి రాధాకృష్ణ తన తుది శ్వాస విడిచారు.మందమర్రి లో సిటీ కేబుల్ అనగానే గుర్తుకు వచ్చేది రాధాకృష్ణ పేరే, అందరి తలలో నాలుకలా అయన ఉండేవారు. వృత్తి పరంగా నిబద్దత, వార్త కవరేజ్ లో ఆత్రుత తో ఉండేవాడు. ఆంధ్రభూమి విలేఖరిగా, ఇతర పత్రికాల్లోను రాధాకృష్ణ పని చేశారు. రాధాకృష్ణ తండ్రి సింగరేణి లో పని చేసి పదవీవిరమణ గావించారు. బొగ్గు గని కార్మికుడి కొడుకు అయిన రాధాకృష్ణ కు దాదాపు అన్ని రాజకీయ పార్టీ ల నేతలు,యూనియన్ ల నాయకులతో, అధికారులు, కార్మిక వర్గం తోను మంచి అవినవభావ సంబంధాలు ఉండేవి. చాలా లో ప్రొఫైల్ తో ఉండేవాడు, రాధాకృష్ణ వ్యక్తిగతంగా నాకు కూడా మంచి మిత్రుడు, తెలంగాణ ఉద్యమం మొదలు, అన్ని ప్రజా పోరాటాల సందర్భంగా అయన కవరేజ్ కోసం పోటీ పడేవారు. పలు సమస్యల మీద జర్నలిస్టులు నిర్వహించిన పోరాట, ఆందోళన, ఉద్య మాలలోనూ కార్యక్రమం లలో రాధాకృష్ణ చాలా చురుకుగా పాల్గొనే వారు, మంచి స్పిరిట్ తో ఉండేవాడు, పౌర హక్కుల, మానవ హక్కుల పై ప్రశ్నించే వాడు, న్యాయం కోసం పోరాడే వారి వెంట ఉండే వాడు, మందమర్రి పట్టణానికి జర్నలిస్టుల లో రాధాకృష్ణ ఒక ఆదర్శవంతమైన వ్యక్తి గా, ఒక శక్తి గా పేర్కొనవచ్చు, నిరంతరం పట్టణం అభివృద్ధి పట్ల ఆయనకు ఒక మంచి విజన్ ఉండేది. రాధాకృష్ణ లాంటి జర్నలిస్టులు నల్ల నేలకు ఎప్పటికి చిరస్మరనీయులే! నా మంచి మానవత్వం ఉట్టి పడే, ప్రజల పట్ల, మందమర్రి పట్టణం పట్ల ప్రేమగల మిత్రుడు రాధాకృష్ణ కు హృదయపూర్వక నివాళులు! రాధాకృష్ణ అమర్ రహే! అయన బౌతికకాయాన్ని చాలా మంది మిత్రులు సందర్శించి నివాళులు అర్పించారు. -ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్,9951865223,

తాజావార్తలు