ఎంఎస్‌ఓలను అదుపుచేస్తూ ట్రాయ్‌ కొత్త నిబంధనలు

y5xpkv3hట్రాయ్‌ నిబంధనలకు కేంద్రం ఆమోద ముద్ర

న్యూఢిల్లీ, మార్చి 26 : కేబుల్‌ టీవీ సేవలు అందించే ఎంఎస్‌ఓలు అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాలను టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కొత్త నిబంధనలను రూపొందించింది. వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం, వారి చెల్లింపులకు రసీదులు ఇవ్వడం, ఈ రెండింటిని తప్పనిసరి చేస్తూ విధివిధానాలను ఖరారు చేసింది. బిల్లులు, రసీదుల విషయంలో ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనలు ఎంఎస్‌ఓలు పాటించడం లేదని తద్వారా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని ట్రాయ్‌ గమనించింది. అలాంటి వారికి వినియోగదారుల సంఖ్యను బట్టి ఒక్క కనెక్షన్‌కు రూ. 20 చొప్పున జరిమానా విధించాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. అలాగే వినియోగదారుడు కోరుకునే ఛానెల్స్‌ ప్రసారం చేయాల్సిన బాధ్యత కూడా ఎంఎస్‌ఓలదేనని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ట్రాయ్‌ కొత్త నిబంధనలకు కేంద్రం గురువారం అనుమతి ఇచ్చింది.