ఎంజీఎం లో మరోసారి పాము కలకలం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 23(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో (ఎం జి ఎం) ఆదివారం మరోసారి పాము కలకలం రేపింది హాస్పిటల్ లోని మెయిల్ సర్జికల్ వార్డులో బెడ్ కింద పాము కనిపించడంతో ఇటు పేషంట్స్, పేషెంట్ అటెండెన్స్, వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పరుగులు తీశారు.. ఇంతకుముందు ఇటీవలే ఫీవర్ వార్డులో బాత్రూంలో వద్ద పాము కనిపించిన సంఘటన మరవక ముందే తాజాగా ఆదివారం మెయిల్ సర్జికల్ వార్డులో పాము కనిపించే కలకలం రేపడంతో ఆసుపత్రి వర్గాలు భయాందోళన గురయ్యాయి. ఇదివరకు ఎన్నడు లేని విధంగా పాములు ఆస్పత్రిలోకి రావడం అందర్నీ ఆందోళన గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారుల సిబ్బంది పాముల బారి నుండి పేషంట్లను పేషెంట్ అటెండర్స్ ను వైద్య సిబ్బందిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Attachments area