ఎంట్రీకి అవకాశం లేదు – వార్న్ యాషెస్‌లో ఆడడం పై క్లారిటీ ఆచ్చిన ఆసీస్ స్పిన్నర్
మెల్‌బోర్న్ ,డిస్శెబ్, 6 (టన్శసలక్ఞ్ష) టెస్ట్ క్రికెట్‌లోకి తన పునరాగమనంపై వస్తోన్న వార్తలకు ఆస్టేల్రియా మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్ తెరదించాడు. తాను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు. గత నాలుగురోజులుగా వార్న్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడంపై బ్రిటీష్ విూడియాలోనూ , ఆసీస్ అభిమానుల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది యూషెస్ సిరీస్ కోసం వార్న్ జట్టులోకి రావాలంటూ క్లార్క్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించడంతో ఈ చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు వార్న్ కూడా పాజిటివ్‌గా స్పందించడంతో అతని రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రత్యేకంగా విూడియా సమావేశం ఏర్పాటు చేసిన వార్న్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తాను క్లార్క్‌తో మాట్లాడలేదని , టెస్టుల్లోకి తిరిగి వచ్చే ఉధ్దేశం కూడా లేదని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టంతా ఆసీస్ దేశవాళీ క్రికెట్ టోర్నీ బిగ్‌బాష్ లీగ్‌లో ఆడడంపైనేనని స్పష్టం చేశాడు. అలాగే బిగ్‌బాష్ తర్వాత ఆసీస్ డొమెస్టిక్ లేక క్లబ్ క్రికెట్ ఆడతానంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించాడు. దానిలో నిజం లేదని , తాను కామెంటేటర్‌గా ఒప్పందంతో బిజీగా ఉన్నట్టు తెలిపాడు. కామెంటేటర్‌గా వచ్చే ఏడాది భారత్ , ఆస్టేల్రియాల మధ్య జరగనున్న తొలి టెస్ట్‌తో కెరీర్ ప్రారంభించనున్నట్టు వెల్లడించాడు.