ఎండల తీవ్రతతో జాగ్రత్త

హెచ్చరిక చేస్తున్న వైద్యులు
ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి):  జిల్లాలో ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకోవడంతో జిల్లా నిప్పులు కొలిమిలా మారింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో కొబ్బరిబొండాలు, చలువ పండ్ల రసాల దుకాణాలు వెలిశాయి. ప్రజలు నిమ్మరసం, కొబ్బరిబొండాలు, దోసకాయలు, శీతల పానియాలను తాగుతూ ఎండ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. జిల్లాలో 44.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దంతో బయటకు రావడానికే ప్రజలు జంకుతున్నారు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ సమయంలో బయట ఎక్కువగా తిరుగొద్దని హెచ్చరించారు. మరో రెండురోజలు ఇలాగే ఉంటుందని అన్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం ఎండాకాలంలో రాష్ట్రంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గత ఏడాది మే నెలలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది సైతం జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత సీజన్‌ ప్రారంభం నుంచి కొనసాగుతోంది. వారం రోజులుగా జిల్లా వ్యా ప్తంగా 43 నుంచి 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.శుక్రవారం 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. ఉదయం 8 గంటలకు ఎండ తీవ్రత ప్రారంభమై సా యంత్రం 6 గంటల వరకు కొనసాగుతోంది. ఎండల కారణంగా జిల్లా కేంద్రంలోని పలు వీధులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఎండపూట బయటకు వెళ్లేవారు ఎండల నుంచి తట్టుకొనేందుకు టోపీలు, తలకు కర్చీఫ్‌లు కట్టుకుంటున్నారు.ఎండాకాలం మరో 25 రోజులు ఉండడంతో జిల్లాలో భానుడి ప్రతాపం అధికంగా ఉండే ప్రమాదం ఉంది. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వాడుతున్నారు. దీంతో పట్టణం తో పాటు గ్రావిూణ ప్రాంతాల్లో విద్యుత్‌ వినియోగం సైతం పెరిగింది.
——

తాజావార్తలు