ఎండిన పంటకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలి -నంబూరి
ఎండిన పంటకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలి -నంబూరి
పెనుబల్లి, అక్టోబర్ 30(జనం సాక్షి )సాగునీరు అందక ఎండిన వరిపంటకుప్రభుత్వంనష్ట పరిహారంరూ.30వేలు చెల్లించాలని ఖమం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వసరావు డిమాండ్ చేశారు,సోమవారం ఆయన ఎండిన పంట పొలాలను పరిశీలించారు,
సత్తుపల్లి నియోజకవర్గంతల్లాడ, కల్లూరు,పెనుబల్లి మండలాల్లో దాదాపు 80 వేల ఎకరాల్లో వరి పంట పండిస్తే ప్రభుత్వం కనీసం 20 రోజులు ఎన్ఎస్పి కాలవ ద్వారా నీరు అందించినట్లయితే 60 వేల ఎకరాలలో పంట చేతికొచ్చేదని అన్నారు, ఎన్నిసార్లు ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కు చెప్పినా పెడచెవిన పెట్టారని,ఇప్పుడు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కంకి మీద ఉన్న పంట పూర్తిగా ఎండిపోయిన తరువాత సీఎం కేసీఆర్ సత్తుపల్లి నియోజకవర్గ ఎన్నికల ప్రచార నిమిత్తం వస్తున్నాడని ఇప్పుడు హడావుడిగా ఎన్ఎస్పి కాలువకు నీరు వదిలారని ,ఎండిపోయిన పొలాలను చూసి కన్నీరు మున్నీరవుతున్న రైతు కడుపు మంట చల్లార్చడానికి ఈ నీరు వదిలరాఅని ప్రశ్నించారు, ఇంత నిర్లక్ష్యం వహించిన జిల్లా యంత్రాంగం పై చర్య తీసుకోవాలని నష్టపోయిన ప్రతి ఎకరానికి 30 వేల రూపాయలు రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని సత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు, కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులుబొర్రా నరసింహారావు, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మహేష్, భాను, రైతులు పాల్గొన్నారు.