ఎంపి రేణుక అనుచరుడిపై దాడి

తన డబ్బు ఇప్పించాలన్న కళావతి
ఖమ్మం,మార్చి 25(జ‌నంసాక్షి): తమను మోసం చేసిన కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళ, డాక్టర్‌ రాంజీ నాయక్‌ భార్య కళావతి డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ ఎస్టీ రిజర్వుడ్‌ టిక్కెట్‌ను ఇప్పిస్తానని రేణుకా చౌదరితోపాటు మరో ఆరుగురు రూ.1.10 కోట్లు తీసుకున్నారని ఆమె తెలిపారు. తమ డబ్బులు తిరిగివ్వాలంటూ బుధవారం రేణుకా చౌదరి అనుచరుల విూడియా సమావేశాన్ని ఆమె అడ్డుకున్నారు. రేణుక అనుచరుడు సైదులు నాయక్‌ పై చెప్పుతో దాడి చేశారు. రేణుకా చౌదరి, ఆమె అనుచరులు కలిసి తమను మోసం చేయడమే కాకుండా, కులం పేరుతో దూషించారని కళావతి ఆరోపించారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుంటే తన పిల్లలతో కలిసి రేణుకాచౌదరి ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించింది. అవసరమైతే సోనియా గాంధీని కలిసి తనకు జరిగిన అన్యాయం వివరిస్తానని తెలిపింది. కళావతి ఫిర్యాదు మేరకు రేణుకాచౌదరితోపాటు మరో ఆరుగురిపై ఈనెల 16న ఖమ్మం అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. అయితే ఇదంతా అబద్దమని చెప్పేందుకు రేణుక అనుచరులు బుదవారం ఇక్కడ విూడియా సమావేశం పెట్టారు. విషయం తెలుసుకున్న కళావతి అక్కడికి చేరుకుని వారిపై ఆరోపణలుకు దిగారు. ఓ దశలో ఆమె రేణుక అనుచరుడిపై దాడి చేశారు. చెప్పులు విసిరారు. .వైరా కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇప్పిస్తామంటూ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కోటి రూపాయలు తీసుకున్నారని, టిక్కెట్‌ రాకపోవడంతో తన భర్త రాంజీ చనిపోయారని కళావతి ఇప్పటికే  కోర్టుకు వెళ్లారు. కోర్టు రేణుకా చౌదరితో పాటు ఆరుగురిపై కేసు పెట్టాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలో రేణుకా చౌదరి అనుచరుడు సైదులు నాయక్‌ విూడియా సమావేశం పెట్టగా, అక్కడకు రాంజీ భార్య వెళ్లి ఉద్రిక్తత సృష్టించింది.ఏకంగా చెప్పు తీసుకుని సైదులు నాయక్‌ పై దాడి చేసింది. ప్రెస్‌ విూట్‌ ఏమని పెడతారని ఆమె ప్రశ్నించారు. తన డబ్బు సంగతేమిటని అడిగింది. దాంతో అక్కడ అంతా రసాభాస ఏర్పడింది.