ఎంసెట్‌ ‘కీ’ విడుదల

2

హైదరాబాద్‌,మే15(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 90 శాతం మంది పరీక్షలలు రాశారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షకు 92.34 శాతం, మధ్యాహ్నం జరిగిన అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగం పరీక్షకు 88.02 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఒక్క నిమిషం నిబంధన అమలు చేయడంతో ఆలస్యంగా వచ్చిన ఆరుగురు విద్యార్థులను పరీక్షలకు అనుమతించలేదు. సాయంత్రం పరీక్ష పూర్తి కాగానే ఎంసెట్‌ ప్రాథమిక కీని ప్రకటించారు. లిలిలి.బిబవజీఎఞవబి.తిని వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉంచారు. కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 18న సాయంత్రం ఐదు గంటల లోపు ఐఇజనీపతీవఞబితినీనిబబిబవజీఎఞవబి-2016ణఎజీతిశ్రీ.ఞనీఎ కు మెయిల్‌ చేయవచ్చని తెలిపారు. ఈ నెల 27 లోపు ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఎంసెట్‌ ను ప్రశాంతంగా నిర్వహించామని తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. తొలిసారిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. 470 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే ఆరుగురు మాత్రమే నిమిషం ఆలస్యంగా వచ్చారని వెల్లడించారు. హైదరాబాద్‌, వరంగల్‌ లలో నాలుగు సెంటర్లలో ఆన్‌ లైన్‌ లో పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు. 274 సెంటర్లలో ఇంజనీరింగ్‌ విభాగం పరీక్ష, 184 కేంద్రాల్లో అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగం పరీక్షలు నిర్వహించారు.ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎంసెట్‌ లో తొలిసారి బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేశారు. బయో మెట్రిక్‌ అటెండెన్స్‌, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని చెప్పడం, గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడం వల్ల విద్యార్థులు ముందే ఎగ్జామ్‌ సెంటర్లకు చేరుకున్నారని రమణారావు, పాపిరెడ్డి చెప్పారు.