ఎఐటియుసి మహాసభలను జయప్రదం చేయండి.
ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ పిలుపు.
హుస్నాబాద్ రూరల్ జూలై 20(జనంసాక్షి) భారతదేశంలో1920 అక్టోబర్ 31న ఆవిర్భావచిన మొట్టమొదటి కార్మిక సంఘం ఎఐటియుసి అని స్వాతంత్రానికి పూర్వమే కార్మిక సంఘం ఫ్యాక్టరీల చట్టము పారిశ్రమిక వివాదాల చట్టము కనీస వేతనాల చట్టం అనేక హక్కులను కార్మిక సంఘాలు లేని రోజుల్లోనే ఎఐటియుసి సాధించి పెట్టిందని అయన అన్నారు.బుధవారం నాడు హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామాంలో హమాలి కార్మికులతో కలిసి జిల్లా మహాసభల కరపత్రం విడుదల చేశారు అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సామ్రాజ్య వాద పెట్టుబడి దారుల చేతుల్లో నలిగి పోతున్నా కార్మిక వర్గాన్ని దిక్ సూచికగా ఎఐటియుసి నిలిచి అనేక కార్మిక ఉద్యమాల ద్వారా కార్మిక చట్టాలను కార్మిక హక్కులను సాధించి పెట్టిన ఏకైక సంఘం ఎఐటియుసి అని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం రొండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగ కార్పొరేట్ బడ పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతు ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, బ్యాంక్, విమనయానం,పోర్ట్,ఎల్.ఐ.సి, బి.హె.ఈ.ఎల్. బి.డి.ఎల్ఓ.డి.ఎఫ్ తదితర అనేక పరిశ్రమలను అప్పగించారని ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న లక్షలాది మంది కార్మికవర్గానికి ఉపాధి లేక రోడ్డు పాలైనారని అనేక పోరాటాలు, కార్మికుల త్యాగాలు బలిదానాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కొడులుగా మార్పులు చేసి కార్పొరేట్ సంస్టలకు అనుకూలంగమార్చే విదానన్నీ తీవ్రంగా ప్రతిఘటించిన ఏకైక కేంద్ర కార్మిక సంఘం ఎఐటియుసి అని కిష్టపురం లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో ఎఐటియుసి నాటి నుంచి నేటి వరకు కార్మికుల సమస్యలు పరిష్కారంచడంలో ముందు వరుసలో వుందని ముఖ్యంగా హమాలి,బీడి,భవన నిర్మాణం ఆర్టిసి, మెడికల్,బ్యాంక్ పోస్టల్, ఆశ, మధ్యహన భోజనం పధకం, ఆటో ఆయిల్, రైస్ మిల్ పుట్నాల మిల్ బర్దాన్ కార్మికులు అంగన్వాడి,రంగంల కార్మికుల హక్కులను సాదించిన ఎఐటియుసికే దక్కుతుందని రాబోయే రోజుల్లో కార్మికులు ఉద్యమించల్సిన కర్తవ్యలా దృష్ట సిద్దిపేట జిల్లా ఎఐటియుసి 3వ మహాసభలు జూలై 27న హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి,అమరుల భవన్ లో జరుగును సిద్దిపేట జిల్లాలోని అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని కిష్టపురం లక్ష్మణ్ కోరారు.
ఈకార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా నాయకులు కర్నాల చంద్రం,పందిల్ల హమాలి సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు రాజయ్య హమలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
