ఎటిఎంల మూతతో సెక్యూరిటీ ఉద్యోగాల కోత

వరంగల్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): బ్యాంకు ఏటీఎంల వద్ద భద్రత డొల్లగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీలు శ్రమదోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారు లేరు. దీనికితోడు ఇటీవల మెల్లగా ఎటిఎంలు మూతపడడంతో వీరు ఉద్యోగాలు కలోపోతున్నారు. అసలే అంతంత మాత్రం జీతంతో పనిచేస్తుంటే ఉన్న ఎటిఎంలు కూడా మెల్లగా మూతపడుతున్నాయి. కనీసం కార్మిక సంఘాలు కూడా వీరిని పట్టించుకునే వారు లేదు. పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు శ్రమదోపిడీకి గురవుతున్నా బ్యాంక్‌కు సంబంధం లేని వ్యవహారంగా మారింది. నిత్యం 12 గంటలు పనిచేస్తున్నా వీరికి ఇచ్చేది కేవలం మూడు నుంచి ఐదు వేల రూపాయలే. ఈ జీతాన్ని కూడా ఇటీవలనే పెంచారు.వీరిని పట్టించుకున్న నాధుడే లేరు. వీరికి కనీస వసతులు, సౌకర్యాలు ఉండవు. కనీస వేతనాల మాట దేవుడెరుగు. ఇతరులకు బ్యాంకుల ద్వారా జీతాలు

చెల్లించే బ్యాంకులు.. వీరికి మాత్రం బ్యాం కుల ద్వారా జీతాలు ఇవ్వవు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లిస్తారు. కానీ గార్డులకు ఎంత ఇస్తున్నారో తెలుసుకోరు. వీరిని పట్టించుకోరు. వీరికి పీఎఫ్‌, మెడికల్‌ లాంటి సౌకర్యాలు అసలే ఉండవు. కార్మికుల సంక్షమానికే ఉన్నామంటూ చెప్పుకునే కార్మిక సంఘాలు వీరిని మాత్రం పట్టించుకోరు. నిట్టనిలువునా శ్రమదోపిడీ జరుగుతున్నా అడిగే నాధుడే ఉండరు. తమకున్యాయం చేయాలని అడుగుఉతన్న పెద్దగా ప్రయోజనం ఉండదని వాపోతున్నారు.