ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురైన ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి…
— జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ….
జోగులాంబ గద్వాల జిల్లాలో 3 రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తునందున గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో ఉన్న నివాసలలో ఉండే ప్రజలను అప్రమత్తం చేయాలని,అలాగే నది తీరా గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను నదులలోకి వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని, వర్షాల దృష్ట్యా పోలీసు అధికారులు సిబ్బంది ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ.. అధికారులకు, సిబ్బందికి సూచించారు.
జిల్లా లో 3 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తునందున ముందస్తు జాగ్రతలలో భాగంగా జిల్లా జెడ్పి చైర్ పర్సన్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి టెలికాన్ఫెరెన్ ద్వారా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రేత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు,రెవెన్యూ అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను, సిబ్బందిని జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ ఆదేశించారు. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వర్షాల వల్ల కలిగే ప్రమాదాల పై ప్రజలను జాగృతం చేయాలని అన్నారు.
జిల్లాలో ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా , రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్,హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సంబంధిత గ్రామాల సర్పంచ్ లను, మరియు ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ,పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల సర్పంచులు మరియు ప్రజా ప్రతినిధులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకొని ప్రమాద నివారణ చర్యలను చేపట్టడానికి సిద్దంగా వుండాలని గ్రామ,మండల,జిల్లా అధికారులకు సూచించారు